పీరియడ్స్ టైంలో ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. కొందరిని కడుపునొప్పి వేధిస్తే.. మరికొందరిని కాళ్ల నొప్పులు బాధ పెడతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
పీరియడ్స్ టైంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువ రక్తస్రావం, కడుపు నొప్పి, నడుము నొప్పితో పాటు కొంతమంది మహిళలకు తీవ్రమైన కాళ్ల నొప్పి కూడా ఉంటుంది. ఇది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ చాలా బాధను కలిగిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
హీట్ ప్యాడ్..
పీరియడ్స్ సమయంలో కాళ్ల నొప్పి లేదా కండరాల నొప్పి ఉంటే.. కాళ్లపై హీట్ ప్యాడ్ తో మసాజ్ చేయండి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ ప్యాడ్ (heat pad) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.
36
మసాజ్..
పీరియడ్స్ టైంలో వచ్చే కాళ్ల నొప్పులకు.. మసాజ్ మంచి చికిత్స. లావెండర్ లేదా ఆవనూనెతో మసాజ్ చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాళ్లకు మసాజ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది.
వ్యాయామం.. కాళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసినప్పుడు.. మెదడు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. వ్యాయామం.. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది కాళ్ల నొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అయితే తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది.
56
సమతుల్య ఆహారం
పోషకాల లోపం కాళ్లలో నొప్పి, కండరాల నొప్పులకు కారణమవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సరైన పోషకాలు తీసుకోండి. విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.
66
హైడ్రేట్ గా ఉండండి..
నెలసరి సమయంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగక పోవడం కూడా కాళ్ల నొప్పులకు కారణం కావచ్చు. కాబట్టి వాటర్ మంచిగా తాగండి. దోసకాయ, పుచ్చకాయ వంటి వాటిని డైట్ లో చేర్చుకోండి.