breakfast
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వల్ల కళ్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె తదితర అవయవాలు బలహీనపడతాయి. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే చికిత్స లేదు. తినే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు స్కిప్ చేయకూడదు. అలాగే ఏవి పడితే అవి తినకూడదు. బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే మధుమేహులు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర
బచ్చలికూర గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం. బచ్చలికూరను తినడం వల్ల మధుమేహుల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే డయాబెటీస్ పేషెంట్లు బచ్చలికూర చాట్ ను బ్రేక్ ఫాస్ట్ లో తినాలి. దీన్ని స్నాక్స్ గా తీసుకోవచ్చు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Chila
చిలా
భారతీయ అల్పాహారంలో పప్పులను ఎక్కువగా ఉపయోగిస్తారు. పప్పులు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ కాయధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. పప్పును పేస్ట్ చేసి, సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమాటాలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి తక్కువ నూనెలో చిల్లాను తయారుచేసుకుని తినాలి.
వేయించిన గింజలు
గింజలు మంచి పోషకాల వనరు. గిజంల్లో కాల్షియం, అసంతృప్త కొవ్వు, ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీకు షుగర్ ఉంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కాల్చిన గింజలను తినండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
జున్ను
జున్నును ఉపయోగించి తీరొక్క వంటలను తయారుచేసుకుని తినొచ్చు. అయితే మధుమేహులకు గ్రిల్డ్ జున్ను చాలా మంచిది. వీళ్లు దీన్ని స్నాక్స్ గా తినొచ్చు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి.దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఇడ్లీ
ఇడ్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోనూ ఇడ్లీను తయారుచేయడం చాలా సులువు. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీను తింటే మంచిది. చిరుధాన్యాలు, రాగులు లేదా జొన్న పిండితో చేసిన ఇడ్లీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
భేల్ పురి
భేల్ పురి ఎంతో టేస్టీ టేస్టీ గా ఉంటుంది. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది షుగర్ పేషెంట్లకు కూడా ప్రయోజకరంగా ఉంటుంది. దీన్ని చాలా తక్కువ సమయంలో చాలా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ముర్మురా, ఉల్లిపాయ, టమాటా, అప్పడా, వేయించిన శనగపప్పు, కొత్తిమీర మొదలైన వాటితో భేల్ పురిని తయారుచేస్తారు.