Health Tips: చెవి నొప్పి తో బాధపడుతున్నారా.. వెల్లుల్లితో ఈ నొప్పికి చెక్ పెట్టండి!

Published : Sep 26, 2023, 02:24 PM IST

Health Tips: చాలా సందర్భాలలో చెవి నొప్పి మనల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే నొప్పి భరించగలిగేది అయినప్పుడు వెల్లుల్లితో ఆ నొప్పికి చెక్ పెట్టవచ్చు. అదెలాగో చూద్దాం.  

PREV
16
Health Tips: చెవి నొప్పి తో బాధపడుతున్నారా.. వెల్లుల్లితో ఈ నొప్పికి చెక్ పెట్టండి!

 చాలా సందర్భాలలో చెవి నొప్పి జలుబు, రద్దీ అలాగే చెవి నుండి ద్రవాలు కారడం వలన వస్తుంది. ఇటువంటి సమయాలలో మందులు తీసుకోవడం కంటే నొప్పిని తగ్గించడానికి ఇంటి నివారణ ఉత్తమం. ఇందుకోసం వెల్లుల్లి ఉత్తమమైన ఎంపిక. వెల్లుల్లి బలమైన యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది.
 

26

 ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇది చెవిలోని ద్రవాల పారుదలను నిరోధిస్తుంది. ముందుగా వెల్లుల్లిని మెత్తని చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని కాటన్ బట్టలో చుట్టి చిన్న బాల్ లా తయారు చేయండి.
 

36

 దీనిని నొప్పి తో బాధపడుతున్న చెవిలో చూపించండి.మరీ లోతుగా చొచ్చుకపోకుండా చూసుకోండి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. దీనివలన చెవి నొప్పి నెమ్మదిగా ఉపసమిస్తుంది. అలాగే చెవి నొప్పికి వెల్లుల్లి నూనె కూడా బాగా పనిచేస్తుంది.
 

46

అలాగే వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి వెచ్చని ఆలీవ్ నూనెతో కలపండి. ఆ మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే ఉంచండి. ఆపై దానిని వడకట్టి  నొప్పితో  ఇబ్బంది పెడుతున్న చెవి రంధ్రంలో కొన్ని చుక్కలు వేయండి.

56

నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం కోసం రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేయండి. దీనివలన చెవి నొప్పి క్రమేణా  తగ్గుతుంది. మరొక పద్ధతిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో మెత్తగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు నిమిషాలు వేడి చేసి, ఈ సారంలోని కొన్ని చుక్కలను మీ చెవిలో వేయండి.
 

66

 ఇలా చేయటం వలన కూడా మీ చెవి నొప్పి చాలావరకు తగ్గుతుంది. నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంటి పద్ధతులు పాటించకుండా వైద్యుడిని సంప్రదించటం ఎంతో అవసరం.

click me!

Recommended Stories