రక్తంలో చక్కెర పెరగొద్దంటే ఈ తప్పులు అస్సలు చేయకండి

First Published | Sep 26, 2023, 1:55 PM IST

మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను చేస్తుంటాం. కానీ వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగొద్దంటే ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

మధుమేహులు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్లు చేసే కొన్ని తప్పుల వల్ల వీరి రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. మీకు తెలుసా? మీకు తెలియకుండానే మీరు రోజూ చేసే పొరపాట్ల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. డయాబెటీస్ ను నియంత్రించడానికి ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

diabetes diet

ప్రాసెస్డ్ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని తినడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఇవి మధుమేహుల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ప్రాసెస్డ్ ఫుడ్ అయిన కెచప్, కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మధుమేహులు వీటిని తినడం మానుకోవాలి. ఏవైనా తినాలనుకుంటే మీరు ఇంట్లో తక్కువ చక్కెరతో తయారుచేసుకుని తినండి. 

Latest Videos


diabetes diet

నిశ్చల జీవనశైలి

నిశ్చల జీవనశైలి లేని పోని రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ఇది మధుమేహుల ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. ఎందుకంటే ఇది వీరి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీస్తుంది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే ప్రతిరోజూ కాసేపు నడవండి. వ్యాయామం చేయండి. యోగాను కూడా చేయండి. 
 

diabetes


ఆహారాలు

మధుమేహులు ఏదైనా తినడానికి ముందు ఖచ్చితంగా వాటి జిఐని చేయాలి. ఎందుకంటే  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే తక్కువ జిఐ ఉన్న ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దమొత్తంలో ప్రభావాన్ని ఏం చూపవు. అందుకే డయాబెటిస్ను నియంత్రించడానికి మీరు తినే ముందు వాటి జిఐ స్కోరును చెక్ చేయండి. 
 

ఫైబర్

మధుమేహులు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కె స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ సున్నితత్వం కూడా మెరుగుపడుతుంది. ఈ ఫుడ్ మీ గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి తృణధాన్యాలు, పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.    

click me!