రక్తస్రావాన్ని ఆపడానికి విటమిన్ కె సహాయపడుతుందా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో విటమిన్ కె లోపం ఉన్నవారికే చిన్న దెబ్బలైనా రక్తస్రావం అవుతుంది. నిజానికి విటమిన్ కె మన రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. విటమిన్ కె ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ తయారు చేయడానికి సహాయపడుతుంది,.ఇది రక్తం గడ్డకట్టడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గాయం నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. గాయం తర్వాత అధిక రక్తస్రావం జరిగి రక్తం గడ్డకట్టకపోతే ఆ వ్యక్తి కూడా చనిపోతాడని నిపుణులు చెబుతున్నారు.