ఫాస్ట్ ఫాస్ట్ గా తినే అలవాటుందా? అయితే మీరిది తెలుసుకోవాల్సిందే..!

First Published | Feb 2, 2024, 10:28 AM IST

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా తినే రోజులు కూడా కరువయ్యాయి.  బిజీ లైఫ్ స్టైల్ వల్ల నేడు ఎంతో మంది బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని కూడా సరిగ్గా నమలకుండా.. ఫాస్ట్ ఫాస్ట్ గా తింటున్నారు. కానీ ఇలా ఎవరో తరిమినట్టుగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 

eating food

ఆయుర్వేదం ప్రకారం.. ఒక్కో ఆహారాన్ని కనీసం 32 సార్లు నమలాలని చెప్తారు. ఇలా నమలడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి కూడా తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఎలాగోలా తిన్నామా? కడుపు నింపామా? అన్నట్టే చూస్తున్నారు. కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా తినే అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే? 

ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది

మనం ఫుడ్ ను ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నప్పుడు దానిని నమలడానికి బదులుగా అలాగే మింగేస్తాము. దీనివల్ల ఫుడ్ గొంతులోనే ఇరుక్కుపోతుంది. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఆహారాన్ని నమలనప్పుడు దానిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. అందుకే ఆహారాన్ని బాగా నములుతూ నెమ్మదిగా తినండి. 



జీర్ణవ్యవస్థకు హానికరం

హడావుడిగా తినడం ఆహారం లాలాజలంతో సరిగ్గా కలవదు. దీంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల పుల్లటి త్రేన్పులు, అపానవాయువు (పిత్తులు), మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
 

బరువు పెరగొచ్చు

అవును హడావుడిగా తినడం మీ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం వల్ల కొన్నిసార్లు కడుపు సరిగా నిండదు. అలాగే పదే పదే ఆకలిగా కూడా అనిపిస్తుంది. దీని వల్ల మీరు అనారోగ్యకరమైన వాటిని తింటూ ఉంటారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.

alone

డయాబెటిస్ సమస్య 

ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. ఇలా హడావుడిగా తినడం వల్ల డయాబెటిస్ తో పాటుగా ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. 
 

కొలెస్ట్రాల్ పెరగొచ్చు

హడావిడిగా తినేవారి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లోపిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండె సంబంధిత సమస్యలు పెరిగినట్టే. అందుకే మీరు అన్నాన్ని ప్రశాంతంగా తినండి. ఎక్కువ సేపు నమలండి. అప్పుడే పోషకాలు అందుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

Latest Videos

click me!