Health Tips: ఒంట్లో వేడి మరీ ఎక్కువైందా.. ఇలా చేసి ఉపశమనం పొందండి!

Published : Jul 18, 2023, 02:20 PM IST

Health Tips: ఒంట్లో ఉండవలసిన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటే వేడి చేసింది అంటాము. ముందు ఈ వేడికి  కారణాలు తెలుసుకుంటే నివారణ మార్గాలు మన చేతిలోనే ఉన్నాయి అంటుంది ఆయుర్వేదం అదేంటో చూద్దాం.  

PREV
16
Health Tips: ఒంట్లో వేడి మరీ ఎక్కువైందా.. ఇలా చేసి ఉపశమనం పొందండి!

 శరీరంలో వేడి వేరువేరు కారణాలు వలన ఎక్కువ అవుతుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వేడి పెరుగుతుంది. అలాగే స్పైసీ ఆహారం తీసుకున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్లినప్పుడు కూడా మన శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది.

26

 శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వలన తలనొప్పి, మలబద్ధకం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే బాడీలో హీట్ తగ్గించుకోవచ్చు అదేంటో చూద్దాం. ఒక స్పూన్ మెంతుల్ని నేరుగా నమలి తినేయండి లేకపోతే పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగిన ఫలితం ఉంటుంది.

36

ఒంట్లో వేడి బాగా ఎక్కువగా ఉండి భరించలేనప్పుడు వెంటనే కొబ్బరి నీళ్లు తాగడం వలన చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే సీతలీకరణ లక్షణాలు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలోనూ తద్వారా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలోనూ ఉపయోగపడుతుంది.
 

46

 వేడి చేసినప్పుడు మజ్జిగ తాగిన త్వరగా ఒక సమనం లభిస్తుంది. రోజుకి ఒకటి నుంచి రెండుసార్లు మజ్జిగ తాగటం వలన అది మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది.
 

56

 అలాగే గ్లాసు గోరువెచ్చని  పాలలో కాస్త పచ్చ కర్పూరం తో పాటు యాలకుల పొడి గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం మాయమవుతుంది. మనల్ని ఇంత ఇబ్బంది పెట్టే ఈ వేడి మన దరిచేరకూడదు అంటే ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి
 

66

 అంటే పుచ్చకాయ ద్రాక్షాలంటే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నువ్వు ఒక రెండు మూడు రెండు ఖర్జూరాలని తీసుకొని రాత్రంతా శుభ్రమైన నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది. అలాగే వేడి వేడి చేసింది అన్నప్పుడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి మసాలా దినుసులు ఉండే ఆహారాన్ని దూరం పెట్టండి.

click me!

Recommended Stories