బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయ పోషకాల బాంఢాగారం. ప్రతిరోజూ అన్నంతో పాటుగా బెండకాయ కూరను తినే వారు కూడా ఉన్నారు. ఇది వారిని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఎక్కువ స్థాయిలో ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఎన్నో పోషకలోపాలను పోగొడుతాయి. అసలు బెండకాయ ను ప్రతిరోజూ తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..