Health Tips: నేటి కాలం కాలంలో సరియైన జీవన విధానం పాటించకుండా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఆశ పడుతున్నారు ప్రజలు. దీర్ఘాయువు కోసం మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.
ఈ పురుగుల పరుగుల పోటీ ప్రపంచంలో వ్యక్తులుగా మనం ఏంటో అనేది మర్చిపోతున్నాం మన అభివృద్ధిలో కళలు ఆరోగ్యమైన అలవాట్లు అన్ని పరుగున పడిపోయి టీవీ షోలకు సినిమాలకు సామాజిక మాధ్యమాలకు బానిసలు అయిపోతున్నాం.
26
సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయంతో పాటు దానికి సంబంధించిన వ్యాధులు సంక్రమించడంతో మరింత ఇబ్బందికి గురవుతున్నాం. శారీరక శ్రమ లేకుండా నిశ్చలంగా ఒక దగ్గర ఉండిపోవటం వలన గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం డిప్రెషన్ వంటి వ్యాధులు వస్తాయి.
36
వీటన్నిటికీ ప్రధాన కారణం జీవనశైలి ఆరోగ్యంగా లేకపోవడం. దీనికి తోడు ఆహారాన్ని కూడా సరైన పద్ధతిలో తీసుకోకపోవడం జంక్ ఫుడ్ కి అలవాటు అవటం మరొక ప్రమాదకరమైన అలవాటు దురదృష్టం కొద్దీ అలవాటు సమాజం మొత్తం పాకిపోయింది.
46
ఇలాంటి జీవనశైలి పాటిస్తూ కూడా దీర్ఘాయుష్యుని మంచి ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. ఆరోగ్యం అనేది అప్పటికప్పుడు వచ్చే ఆస్తి కాదు అది కొన్ని సంవత్సరాల కటోర శ్రమ. కాబట్టి ఆరోగ్యం కావాలి అని తాపత్రయం ఉంటే సరిపోదు దానికి తగిన శ్రమ కూడా చేయాలి.
56
అందుకోసం సరియైన వ్యాయామం చేయాలి, పౌష్టిగా ఆహారం తీసుకోవాలి. మనసుని లేనిపోని అలజడికి గురి చేయకుండా ప్రశాంతంగా ఉంచేలాగా చూసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఆయుషు కూడా పెరుగుతుంది అంటారు పెద్దలు.
66
అలాగే నిద్ర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోకపోతే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలా అన్నారు కదా అని రోజంతా పడుకున్నా ప్రమాదమే. కాబట్టి దేన్నైనా మితంగా తీసుకుంటూ సరియైన వ్యాయామం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షుని సంపాదించుకోండి.