ఆకలి లేకుండా, నీరసంగా, అలసటగా అనిపిస్తోందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే..!

First Published | Dec 2, 2023, 2:11 PM IST

ఒంట్లో శక్తి తగ్గడం, అలసట, మైకం వంటి సమస్యలతో కొందరు తరచుగా బాధపడుతూ ఉంటారు. ఏదేమైనా వీటివల్ల రోజువారి పనులను కూడా చేసుకోలేరు. అయితే దీనికి ఒక సమస్యే కారణమని నిపుణులు అంటున్నారు. అదేంటంటే?

మనలో చాలా మందికి విటమిన్ బి 12 లోపం ఉంటుంది. కానీ ఈ లోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ విటమిన్ ను మన శరీరం సహజంగా ఉత్పత్తి చేయదు. గుడ్లు, చేపలు, మాంసం, పాలు, షెల్ఫిష్లలో ఈ విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది ఎన్నో శారీరక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, సరైన నాడీ పనితీరుకు, డిఎన్ఎ సంశ్లేషణకు ఎంతో అవసరం. ఈ విటమిన్ బి12 మీలో లోపిస్తే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అలసట, నీరసం

ఒంట్లో శక్తి లేకపోవడం, విపరీతమైన అలసట విటమిన్ బి12 సాధారణ లక్షణాలని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం మన రోజువారీ కార్యకలాపాలు, మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.

లేత లేదా పసుపు రంగు చర్మం

విటమిన్ బి 12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్తం లోపం ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారి చర్మం లేత లేదా పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు చర్మం రంగును ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 


శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

విటమిన్ బి 12 లోపం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ ను తీసుకెళ్లే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మైకము, తలనొప్పి

విటమిన్ బి 12 లోపం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల మైకము, అప్పుడప్పుడు తలనొప్పి వస్తాయి. 
 


నాలుక ఉబ్బడం

గ్లోసిటిస్ అనేది నాలుక వాపుకు గురయ్యే పరిస్థితి. అలెర్జీ , అంటువ్యాధులు, నోరు పొడిబారడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది విటమిన్ బి 12 లోపం మొదటి లక్షణమంటున్నారు నిపుణులు. ఇది నాలుక ఉబ్బడానికి, మృదువుగా కనిపించడానికి, రంగు మారడానికి కారణమవుతుంది.

జీర్ణ సమస్యలు

విటమిన్ బి 12 లోపం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అంటే విరేచనాలు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం వంటి విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు కూడా వస్తాయి. 
 

న్యూరోలాజికల్ సమస్యలు

నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ బి 12 చాలా చాలా అవసరం. దీనివల్ల అవయవాల తిమ్మిరి కూడా ఉంటుంది. 

జ్ఞాపకశక్తి తగ్గడం

మన మెదడు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి12 కూడా చాలా అవసరం. ఈ లోపం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఏకాగ్రతలో ఇబ్బంది, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యలు వస్తాయి. 
 


డిప్రెషన్

విటమిన్ బి12 లోపం కూడా మానసిక సమస్యలను కలిగిస్తుంది. మన శరీరంలో విటమిన్ బి 12 తక్కువగా ఉంటే మెదడులో మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. ఇది నిరాశ, చిరాకు వంటి మానసిక స్థితి మార్పులకు దారితీస్తుంది.

హార్ట్ ప్రాబ్లమ్స్

విటమిన్ బి 12 లోపం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. 

Latest Videos

click me!