చలికాలంలో చన్నీటి స్నానం.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..!

First Published | Dec 2, 2023, 10:55 AM IST

చలికాలంంలో ఏ ఒక్కరూ చల్లని నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడరు. వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. కానీ వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

ఆరోగ్యంగా ఉండటానికి హెల్తీ డైట్ తో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే. అలాగే ఆరోగ్యానికి పరిశుభ్రత కూడా చాలా చాలా ముఖ్యం. మనం హెల్తీ గా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, మన వ్యక్తిగతను ఖచ్చితంగా పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత విషయానికొస్తే ప్రతి రోజూ ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎండాకాలంలో అయితే రోజుకు రెండు మూడు సార్లు కూడా స్నానం చేస్తుంటారు. కానీ చలికాలంలో ఇలా కాదు. చాలా మంది చలికాలంలో రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తుంటారు. అది కూడా వేడి వేడి నీళ్లతోనే. 
 

వాతావరణం ఎలా ఉన్నా.. మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి రెగ్యులర్ గా స్నానం చేయడం చాలా అవసరం. అయితే చాలా మంది చలికాలంలో వేడి వేడి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కానీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వేడి నీటికి బదులుగా చల్లని నీటితో స్నానం చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. చలికాలంలో చన్నీటి స్నానంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


bath

చలికాలంలో చన్నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. అయితే చలికాలంలో చన్నీటి స్నానం చేయడం పూర్తిగా సాధారణమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కండరాల ఉద్రిక్తతను తొలగిస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచడానికి.. 

అవును చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చల్లని నీటితో స్నానం చేస్తే శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. నిజానికి చల్లని నీటితో స్నానం చేసినప్పుడు శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది.ఈ ప్రక్రియలో తెల్ల రక్త కణాలు విడుదలవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
 

ఒత్తిడి నుంచి ఉపశమనం 

చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా చల్లటి నీటితో స్నానం చేసిన తర్వాత మీరు మరింత రిలాక్స్ అవుతారు.
 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

చల్లని నీటితో స్నానం చేస్తే శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం బాగా చేరుతుంది. అందుకే మనం వెచ్చగా ఉంటాం. ఈ విధంగా చన్నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలపడతాయి. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

కండరాలు వేగంగా కోలుకోవడానికి ..

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ చన్నీటి స్నానం కోల్డ్ కంప్రెస్ లా పనిచేస్తుంది.
 

చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా.. 

చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది.  అలాగే చర్మపు చికాకు, దద్దుర్లు కూడా రావొచ్చు. అంతేకాదు మీ జుట్టులో చుండ్రు ఏర్పడుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. కాగా చల్లని నీటితో స్నానం చేస్తే చర్మానికి, జుట్టుకు మేలు జరుగుతుంది.
 

ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి

మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే చలికాలంలో చన్నీటి స్నానం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు రోగులు సమస్యలు ఉంటే కూడా మీరు చల్లని నీళ్లతో స్నానం చేయకండి. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
 

click me!