విటమిన్ సి లోపం ఇన్ని రోగాలొచ్చేలా చేస్తుందా?

First Published Jun 2, 2023, 9:49 AM IST

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఇలాంటి వాటిలో విటమిన్ సి ఒకటి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పోషకం లోపిస్తే ఎన్నో రోగాలు వస్తాయి తెలుసా? 
 

మీ శరీరం పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. ఇవి పుష్కలంగా అందితేనే మన శరీరం అన్ని విధాలా మెరుగ్గా పనిచేస్తుంది. వీటిలో ఏ ఒక్కపోషకం లోపించినా సమస్యలు వస్తాయి. మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ సి ఒకటి. ఈ విటమిన్ సి అనారోగ్యాల నుంచి వేగంగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక రోగాల ముప్పును తప్పించడానికి సహాయపడుతుంది. 

విటమిన్ సి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇదొక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర రక్షణను బలోపేతం చేయడానికి, రోగనిరోధక వ్యవస్థను బలంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాగా భారతదేశంలో చాలా మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఉత్తర భారతదేశంలో వృద్ధుల జనాభా (74 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు) సుమారు 60%, దక్షిణ భారతదేశంలో ఈ జనాభాలో 46% మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారు. అసలు విటమిన్ సి లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అంటువ్యాధులు, సాధారణ జలుబు

జలుబు, ఫ్లూ వంటి సీజనల్ అంటువ్యాధులను తగ్గించడానికి విటమిన్ సి చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఎన్సీడీలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది అత్యవసరం. సాధారణ జలుబు తొందరగా తగ్గడానికి ఇది ఎక్కువకాకుండా చేయడానికి విటమిన్ సి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. 
 

నిపుణుల ప్రకారం.. విటమిన్ సి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక ముఖ్యమైన పోషకం. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా లక్షణాలను, ఇది త్వరగా తగ్గించడం వంటి సీజనల్ అంటువ్యాధులను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు ఉన్నవారికి విటమిన్ సి ఎక్కువ అవసరమవుతుంది. శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. 
 

diabetes

డయాబెటిస్

డయాబెటీస్ పేషెంట్లకు విటమిన్ సి చాలా అవసరం. ఈ విటమిన్ సి మధుమేహుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ వంటి సాధారణ ఎన్సీడీ  రోగులలో కనిపించే అధిక ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ఇతరులకన్నా ఎక్కువ విటమిన్ సి అవసరం కావొచ్చంటున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్న వారు డయాబెటిస్ లేనివారి కంటే 30% తక్కువ విటమిన్ సి సాంద్రతలను కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
 

హృదయ సంబంధ వ్యాధులు

కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడానికి విటమిన్ సి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హృదయ సంబంధ వ్యాధులు లేదా రక్తపోటు రోగులలో విటమిన్ సి అవయవ నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే వాస్కులర్ ఎండోథెలియల్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

anemia

రక్తహీనత

విటమిన్ సి మన శరీరం ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా ముఖ్యం. రక్తహీనత సమస్య ఉంటే మీలో విటమిన్ సి లోపం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.  రక్తహీనత విటమిన్ సి లోపానికి సంకేతం.
 

teeth

ఈ విటమిన్ సి గాయాలను నయం చేయడానికి, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీర రక్షణను బలోపేతం చేయడానికి, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. 
 

న్యుమోనియా

న్యుమోనియా పేషెంట్లు తొందరగా కోలుకోవడానికి విటమిన్ సి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మంచి పోషణకు ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం అయితే.. ఈ లోపాన్ని ఎదుర్కోవటానికి ఇది సరిపోకపోవచ్చు. మీ డాక్టర్ సూచించిన మోతాదులో విటమిన్ సి ని తీసుకోండి. విటమిన్ సి సప్లిమెంట్ తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించండి. 
 

click me!