డయాబెటీస్ పేషెంట్లు పాలు తాగితే..!

First Published Jun 1, 2023, 3:42 PM IST

పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలను సమతుల్య ఆహారం అంటారు. ఇది డయాబెటీస్ పేషెంట్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కానీ..
 

ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పాలను రోజూ తాగాలి. చాలా మంది పాలను షేక్స్, ఐస్ క్రీం, స్మూతీలతో పాటుగా ఎన్నో ఆహారాల్లో కలుపుతారు. ఇక డయాబెటీస్ పేషెంట్ల విషయనికొస్తే.. వీళ్లు ఏది తినాలన్నా భయపడిపోతుంటారు. ఎక్కడ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయేమోనని. అయితే డయాబెటిస్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. మధుమేహులకు ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుధాన్యాలతో పాటుగా పాల ఉత్పత్తులపై కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాలు ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ పాల దినోత్సవం 2023 థీమ్

పాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్ 'డెయిరీ రంగంలో సుస్థిరత'. ఇది గ్లోబల్ ఫుడ్. 2001లో ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జూన్ 1ను తొలిసారిగా ప్రపంచ పాల దినోత్సవంగా ప్రకటించింది. దీని ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
 

పాలలోని పోషక విలువలు

యుఎస్డీఏ ప్రకారం.. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ కె లు పాలలో పుష్కలంగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉండే ఒక కప్పు పాలను తాగడం వల్ల శరీరంలో 8 గ్రాముల ప్రోటీన్ లోపం తీరిపోతుంది. దీనిలో 67 శాతం కాల్షియం, 35 శాతం మెగ్నీషియం, 44 శాతం ఫాస్ఫేట్ లు ఉంటాయి.

డయాబెటిస్ రోగులు పాలను తాగొచ్చా? 

నిపుణుల ప్రకారం.. పాలు ఎన్నో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం. పాలు డయాబెటిస్ పేషెంట్లకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. అయితే దీని వినియోగం మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. అలాగే పాలలోని పోషక విలువలు ఆ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేయబడింది. ఉదాహరణకు. డయాబెటిస్ ఉన్నవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. పాలు తాగడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం పోతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

World Milk Day 2023- Know History, Significance, Celebration

డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఎన్ని పాలను తాగాలి? 

మధుమేహంతో బాధపడేవారు తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు, స్కిమ్డ్ ఆవు పాలను తాగడం మంచిది. వీళ్లు రోజుకు 2 నుంచి 3 కప్పుల పాలను తాగడం  మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో పిండి పదార్థాలు, కేలరీలను అదుపులో ఉంచుతుంది. అలాగే అనేక అధ్యయనాలు పాలు, టైప్ 2 డయాబెటిస్ మధ్య ప్రత్యేక సంబంధాన్ని చూపిస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్ నివారణకు పాలు సహాయపడతాయి. కొన్ని ఇతర పరిశోధనల ప్రకారం.. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. 
 

Image: pexel

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్పాహారంలో తృణధాన్యాలతో పాల ప్రోటీన్ తీసుకోవడం వల్ల పోస్ట్-ప్రాండియల్ గ్లైసెమిక్ తగ్గుతుంది. అలాగే పాల ఉత్పత్తులలో ఉండే ప్రోటీన్ గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లో పాలలో ఉండే పిండి పదార్థాలు రక్తంలోకి వెళ్లి చక్కెర రూపంలోకి మారుతాయి. ఇలాంటి పరిస్థితిలో పాలను ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.

పాల నుంచి తయారైన పెరుగు, జున్నులో  గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర పెరగడానికి కారణమవుతాయి.
 

click me!