పైల్స్ ఉన్నవారు దోసకాయ విత్తనాలను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 2, 2023, 7:15 AM IST

దోసకాయ విత్తనాల్లో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయంటున్నారు నిపుణులు. వీటిని ఎన్నో రకాల స్వీట్లు, హల్వాను అలంకరించడానికి ఉపయోగిస్తారు. 
 

దోసకాయను తిని దోసకాయ విత్తనాలను బయటపడేసేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి దోసకాయ విత్తనాలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కీరదోసకాయ విత్తనాల్లోఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి భేదిమందు లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే దోసకాయ విత్తనాలు పైల్స్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

దోసకాయ విత్తనాలు ప్రేగు కదలికను వేగవంతం చేస్తాయి

కీరదోసకాయ గింజలు ప్రేగు కదలికను వేగవంతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి దీనిలో మంచి మొత్తంలో roughage, ఫైబర్ ఉంటుంది. ఈ roughage కడుపు నీటిని గ్రహిస్తుంది. మలాన్ని లూజ్ గా చేస్తుంది. అంతేకాదు ఇది ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. అలాగే పైల్స్ లక్షణాలను తగ్గిస్తుంది. కఠినమైన మలం, నొప్పి, ప్రేగు కదలికలలో ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది.

భేదిమందు 

కీరదోసకాయ గింజలు భేదిమందులుగా పనిచేస్తాయి. అంటే కడుపులో మలాన్ని పలుచగా చేసి సులభంగా బయటకు రావడానికి సహాయపడే పదార్థం. ఈ విత్తనాలలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. కడుపును శుభ్రపరచడానికి సహాయపడతాయి.
 

piles

పైల్స్ లో దోసకాయ విత్తనాలను ఎలా ఉపయోగించాలి?

కీరదోసకాయ విత్తనాలను పైల్స్ తో బాధపడేవారు అనేక విధాలుగా ఉపయోగించొచ్చు. మొదటగా మీరు ఈ విత్తనాలను చూర్ణం చేయాలి. అలాగే వీటిని నీటిలో ఒక రకమైన పానీయంగా ఉపయోగించాలి. రెండోది మీరు ఈ విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పుతో కలిపి తినొచ్చు. ఇది పొట్టను సులభంగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
 

click me!