రోడ్డు పక్కన ఉంటాయని పిచ్చి మొక్క అనుకునేరు.. లాభాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

First Published | Jan 6, 2025, 6:35 PM IST

ప్రకృతిలో మనకు మేలు చేసే ఎన్నో ఔషధాలు ఉన్నాయి. రోడ్డు పక్కన వాటంతటవే పెరిగే మొక్కలతో సైతం ఎంతో మేలు ఉంటుంది. అలాంటి వాటిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న మొక్క ఒకటి. ఇంతకీ ఈ మొక్క పేరెంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రోడ్ల పక్కన, గ్రౌండ్స్‌లో, మురికి కాలువల పక్కన ఇలాంటి మొక్కలు దర్శనమిస్తుంటాయి. పసుపు రంగులో పువ్వు, చిన్న చిన్న కాయలతో ఈ మొక్కలు చూడ్డానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి. అతిబల పేరుతో పిలిచే ఈ మొక్కలను ప్రత్యేకంగా ఎవరు పెంచరు, వీటికి నీరు కూడా పోయరు. కానీ వాటంతటవే పెరుగుతుంటాయి. అయితే ఇవేవో పిచ్చి మొక్కలు అనుకుంటే మాత్రం పొరబడినట్లే. ఎందుకంటే ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, కాండం, వేళ్లు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

ఈ మొక్క వేర్లను కషాయం చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేళ్లతో తయారు చేసిన కషాయాన్ని తాగితే విరేచనాలు, మూత్రంలో రక్తం పడడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక కడపుపు నొప్పికి వీటితో చెక్‌ పెట్టొచ్చు. అతిబ‌ల‌, పృష్ణ‌ప‌ర్ణి, క‌టేరి, ల‌ఖ్‌, శొంఠి వేసి పాల‌లో క‌లిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది.
 


అతిబల విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడేవారు అతిబల విత్తనాలను ఉడింకించి తీంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఇన్‌స్టాంట్ ఎనర్జీ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చని చెబుతున్నారు. 
 

అతిబల మొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేస్తే దంత సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. దంతాలు బలంగా మారుతాయి. చిగుళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్లు వాపు సమస్యతో బాధపడుతున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

ఈ మొక్కలతో శ్వాస సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి. అతిబల ఆకుల డికాషన్‌లో ద్రాక్ష పండ్లు, చక్కెర వంటివి కలిపి తీసుకుంటే కఫంతో కూడిన దగ్గు తగ్గుతుంది. ఈ ఆకులను వేడి నీటిలో వేసి మరగించాలి. అనంతరం ఆ నీటిలో కాస్ల బెల్లం వేసి కలపాలి. దీనిని చిన్నారులకు ఇస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఇలాంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos

click me!