Health Tips: అల్పాహారంగా నానబెట్టిన శనగలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

Published : Nov 03, 2023, 12:35 PM IST

Health Tips: ప్రతిరోజు నానబెట్టిన శనగలని అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్యులు. అయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
16
Health Tips: అల్పాహారంగా నానబెట్టిన శనగలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

 నానబెట్టిన శనగలలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వులు, పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్ లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇది పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. నానబెట్టిన శనగలు బరువు తగ్గటానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది ఒక పోషకం.
 

26

ఇది పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిల్ స్థాయిని మెరుగు పరచడం లో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, నానబెట్టిన సెనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి అన్ని హానికరమైన టాక్సిన్స్ ని తొలగిస్తుంది.
 

 

36

 యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సెనగలలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినకుండా నిరోధిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది. శనగల్లో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శనగల్లో ఉండే డైటరీ ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది.
 

46

శనగలు శరీరానికి అవసరమైన విటమిన్ లు ఖనిజాలకు మంచి మూలం. అలాగే సెనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.  అలాగే జుత్తు తెల్లబడకుండా నివారించడంలో సహాయపడుతుంది.

56

శనగలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా 474 మిల్లీగ్రాములు పొటాషియం లభిస్తుంది. పొటాషియం మన శరీరంలోని బీపీని నియంత్రిస్తుంది. అలాగే గుండె సమస్య రాకుండా చూస్తోంది. అలాగే హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.

66

శనగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఏ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. అలాగే శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది దీంతో రక్తహీనత సమస్యను నివారించవచ్చు.

click me!

Recommended Stories