ఒక్క ఎండాకాలంలోనే కాదు చలికాలంలో కూడా కీరదోసకాయలను తినొచ్చు.. వీటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Health Tips: కీరదోసకాయలను ఎండాకాలంలో బాగా తింటారు. ఎందుకంటే వీటిలో ఉండే వాటర్ కంటెంట్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దీనిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోనే చలువ చేసే గుణం కారణంగా వీటిని ఒక్క ఎండాకాలంలోనే తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ వీటిని చలికాలంలో కూడా తినొచ్చు. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి తెలుసా? 
 

amazing  health benefits of adding cucumber in your diet in winters rsl
cucumber

నవంబర్ తోనే చలి స్టార్ట్ అయ్యింది. ఈ చలిపెరుగుతున్న కొద్దీ దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందుకే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకోవాల్సి  వస్తుంది. వాతావరణంలోని మార్పులు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూల బారిన త్వరగా పడతారు. అందకే సీజన్ కు తగ్గట్టు మన ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 

amazing  health benefits of adding cucumber in your diet in winters rsl

మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో కీరదోసకాయ ఒకటి. అయితే చాలా మంది వీటిని కేవలం ఎండాకాలంలోనే తింటుంటారు. కానీ వీటిని చలికాలంలో కూడా తినొచ్చు. అవును ఈ సీజన్ లో వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 


Cucumbers

రక్తంలో చక్కెర నియంత్రణ

చలికాలంలో డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో డయాబెటీస్ పేషెంట్లకు కీరదోసకాయ ఒక వరం తెలుసా? అవను కీరదోసకాయ  మధుమేహుల రక్తంలో చక్కెర స్తాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ కు సంబంధించిన ఎన్నో సమస్యలను నివారిస్తుంది. అందుకే మధుమేహులు చలికాలంలో కూడా ఎలాంటి భయం లేకుండా కీరదోసకాయలను తినొచ్చు. 

Image: Freepik

బరువు తగ్గడానికి

ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలోనే ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఈ సీజన్ లో మన ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వస్తాయి. కానీ శారీరక శ్రమ మాత్రం తగ్గుతుంది. అందుకే ఈ సీజన్ లో బాగా బరువు పెరిగిపోతారు. చలికాలంలో మీరు బరువు పెరగకూడదంటే కీరదోసకాయను ఖచ్చితంగా తినండి. ఇది మీరు బరువు పెరిగిపోకుండా చూస్తుంది. 
 

cucumber

మెరుగైన జీర్ణక్రియ

ఎప్పుడూ మీరు జీర్ణ సమస్యలతో బాధపడతారా? అయితే కీరదోసకాయను ఖచ్చితంగా తినండి. అవును ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కీరదోసకాయలో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కీరదోసకాయ మలబద్దకం సమస్యను కూడా పోగొడుతుంది. అలాగే ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. 
 

గుండె ఆరోగ్యం 

దేశవ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఎంతో మంది ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు తెలుసా? కీరదోసకాయ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అవును కీరదోసకాయలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ఇది మీకు గుండెజబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

cucumber

చర్మం, జుట్టు, గోళ్లకు మేలు 

చలికాలంలో తేమ తగ్గుతుంది. దీని వల్ల జుట్టు, చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. కాగా మీ రోజువారి ఆహారంలో కీరదోసకాయలను చేర్చితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కీరదోసకాయలలో ఉండే సిలికా జుట్టు, గోర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన చర్మాన్ని తేమగా, హెల్తీ ఉంచుతాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!