కుంకుమపువ్వుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 26, 2021, 06:13 PM IST

 కుంకుమపువ్వు (Saffron) ఔషధాల గని. కుంకుమపువ్వును శాఫ్రాన్‌ అని కూడా అంటారు. కుంకుమపువ్వును పూర్వంలో అనేక ఔషధాల తయారీలో ఉపయోగించేవారు. కుంకుమపువ్వు ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. భారతదేశంలో కాశ్మీర్ లో కుంకుమపువ్వు ఎక్కువగా పండిస్తారు.  

PREV
110
కుంకుమపువ్వుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వును తయారుచేస్తారు. కుంకుమపువ్వు చాలా ఖరీదైనది. కుంకుమపువ్వు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా కుంకుమపువ్వును తీసుకుంటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..
 

210

కుంకుమపువ్వులో క్రోసిన్, క్రోసిటిన్ వంటి మొదలైన గ్లూకోసైడులు (Glucosides) పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు లైకోఫీనులు (Lycopene), గామా కెరోటిన్ లు, బీటా అధికంగా ఉన్నాయి. ఇది శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. కుంకుమపువ్వును వంటల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి వంటలకు మంచి రుచిని, మంచి కలర్ ను అందిస్తాయి. కుంకుమపువ్వును తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

310

గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది: కుంకుమపువ్వులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపరచి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. గుండె సమస్యల (Heart problems) నుంచి రక్షిస్తుంది.
 

410
saffron

రుతుక్రమ సమస్యలను, నొప్పిలను నివారిస్తుంది: రుతుక్రమ (Menstruation) సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మహిళలు చాలా ఇబ్బందికి గురవుతారు. నడుము నొప్పి, కడుపు నొప్పి (Abdominal pain) వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటప్పుడు గ్లాసు వేడిపాలలో చిటికెడు కుంకుమపువ్వులను వేసికోని రోజూ తాగితే రుతుక్రమం సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

510
saffron

జీర్ణాశయ, మలబద్దకపు సమస్యలను తగ్గిస్తుంది: కుంకుమపువ్వులో ఉండే ఔషధ గుణాలు జీర్ణవ్యవస్థ (Digestive system) పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు గ్లాసు వేడిపాలలో చిటికెడు కుంకుమపువ్వులను వేసి తాగితే జీర్ణాశయ సమస్యలు తగ్గి మలబద్ధకం (Constipation) సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

610
saffron

క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది: కుంకుమపువ్వులో క్యాన్సర్ (Cancer) ను నిరోధించే కీమో-ప్రివెంటివ్‌ (Chemo-preventive) లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. కనుక ప్రతిరోజు కుంకుమపువ్వు పాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

710
saffron

నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు కుంకుమ పువ్వు (Saffron milk) వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్యలు (Insomnia problems) తగ్గి గాఢ నిద్రలోకి జారుకుంటారు. 

810

గర్భిణీ స్త్రీలకు మంచిది: గర్భిణీ స్త్రీలు (Pregnant women) కుంకుమపువ్వు పాలను తాగితే పుట్టబోయే బిడ్డకు మంచి నిగారింపు అందుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ (Vitamins) బిడ్డ ఎదుగుదలకు కూడా సహాయపడతాయి. 

910
Saffron

చర్మ సమస్యలను తగ్గిస్తుంది: చర్మ నిగారింపుకు మంచి బ్యూటీ ప్రొడక్ట్ (Beauty product) గా  కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్ లు సహాయపడతాయి. ఇవి ముఖంపై ఏర్పడిన మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. చర్మానికి తగినంత తేమను అందించి పొడి చర్మ సమస్యలను (Skin problems) తగ్గిస్తాయి.

1010

వీర్యవృద్ధి కలుగుతుంది: కుంకుమ పువ్వును, తేనెను కలిపి తీసుకుంటే వీర్య వృద్ధి (Sperm growth) జరిగి లైంగిక కోరికలు (Sexual desires) పెరుగుతాయి. ఎక్కువసేపు కలయికలో పాల్గొనడానికి కావలసిన శక్తిని అందిస్తాయి.

click me!

Recommended Stories