బియ్యం పిండితో అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం!

First Published Dec 26, 2021, 4:56 PM IST

అందమైన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! అయినా తగిన ఫలితం లభించలేదా! చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తున్నారా! అయితే చర్మ సౌందర్యం కోసం ఇంటిలోనే సహజసిద్ధంగా తయారు చేసుకునే బియ్యం పిండి (Rice flour) ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయండి.
 

బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ లు మీ చర్మ సౌందర్యానికి మీరు ఆశించిన ఫలితాన్ని అందిస్తాయి. ఇది అందమైన చర్మం నిగారింపు కోసం మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.. 
 

బియ్యం పిండిని పూర్వకాలంలో సౌందర్య లేపనంగా (Cosmetic ointment) ఉపయోగించేవారు. అందుకే వారికి ఎటువంటి చర్మ సమస్యలు ఉండేవి కాదు. బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన ఫలితాలను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మానికి బ్లీచ్ గా, స్క్రబ్ గా సహాయపడి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ (Face pack) ల గురించి తెలుసుకుందాం.. 
 

మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), కలబంద గుజ్జు (Alovera gel), తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
 

మృతకణాలు తొలగిపోతాయి: ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), సెనగ పిండి (Besan), తేనె (Honey), కొబ్బరి నూనె  (Coconut oil), పంచదార (Sugar) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి మంచి స్క్రబ్ గా ఉపయోగపడి మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.  
 

డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది: ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), బాగా పండిన అరటి పండు గుజ్జు (Banana pulp), ఆముదం (Castor oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కళ్ళ కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ లపై అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించి కళ్ళకింద చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 
 

చర్మాన్ని టైట్ గా చేస్తుంది: ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), ఎగ్ వైట్ (Egg white), తేనే (Honey)  వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇది వదులైన చర్మాన్ని టైట్ గా చేస్తుంది. ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

click me!