విటమిన్ 'డి'తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు ఏంటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 26, 2021, 05:30 PM ISTUpdated : Dec 26, 2021, 05:43 PM IST

ఖర్చు లేకుండా సూర్యరశ్మి (Sunshine) నుంచి వచ్చే విటమిన్ డి (Vitamin D) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. విటమిన్ డి శరీరానికి తప్పనిసరి. ఉదయం పూట అరగంట పాటు ఎండలో కూర్చుంటే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-డికి శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా విటమిన్ డి తో శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..  

PREV
17
విటమిన్ 'డి'తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు ఏంటో తెలుసా?

విటమిన్ డి తో ఆరోగ్య ప్రయోజనాలు:
విటమిన్ డి మనం తిన్న ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, భాస్వరం మొదలగు ఖనిజలవణాలు చిన్న పేగుల ద్వారా రక్తంలో శోషణ జరగడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.  మన శరీరంలో విటమిన్-డి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలకు (Illness problems) గురవుతుంది. కనుక శరీర ఆరోగ్యానికి విటమిన్ డి తప్పనిసరి. విటమిన్ డి కారణంగా ఎముకలు ఆరోగ్యంగా (Bone health) ఉంటాయి.

27

ఇది పిల్లల ఎదుగుదలకు (Child growth) సహాయపడుతుంది. అయితే ఇది కేవలం ఎముకలకు మాత్రమే కాదని గుండె ఆరోగ్యానికి (Heart Health) మేలు చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. విటమిన్ డి ఆహారంలో కొద్ది పాలలో ఉన్నప్పటికీ దీనికి ప్రధాన వనరు సూర్యరశ్మినే. కాబట్టి రోజూ కొంతసేపయిన శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
 

37

విటమిన్ 'డి' లోపంతో వచ్చే సమస్యలు:
విటమిన్ డి పై సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ అనేక పరిశోధనలు చేసింది. అయితే ఈ పరిశోధనలో విటమిన్ డి లోపంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా హృద్రోగాలు (Heart diseases), బీపీ వ్యాధుల (BP diseases) బారిన పడుతున్నట్లు వాళ్ల పరిశోధనలో తేలింది.

47

విటమిన్-డి లోపం (Vitamin-D deficiency) తీవ్రంగా ఉన్న వారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో (Research) వెల్లడైంది. గుండెజబ్బులకు విటమిన్-డి లోపానికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిలో విటమిన్-డి లోపిస్తోంది. కనుక కొద్ది సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. 
 

57

మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి లేకపోవడం, అలాగే శరీరానికి సూర్యరశ్మి తగలకపోతే విటమిన్-డి లోపం ఏర్పడి అనేక సమస్యలు కలుగుతాయి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ముఖ్యంగా దీని ప్రభావం (Effect) పిల్లలపై ఉంటుంది. ఎముకల నిర్మాణం బలహీనపడినప్పుడు రికెట్స్ వ్యాధి (Rickets disease) వస్తుంది.
 

67

గర్భిణీలలో విటమిన్-డి లోపిస్తే పుట్టబోయే పిల్లల ఎముకల దృఢత్వం (Bone stiffness) సరిగా ఉండదు. కనుక రూపాయి ఖర్చు లేకుండా సూర్యరశ్మితో లభించే విటమిన్ డి పొందడం కోసం రోజూ ఉదయం పూట, సాయంత్రం సమయాలలో  కొద్ది సమయం ఎండను ఆస్వాదించడం ఆరోగ్యానికి మంచిది (Good for health).
 

77

విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు: పాలు, పెరుగు, జున్ను, గుడ్డు పచ్చసొన, జంతు మాంస కాలేయం, ధాన్యాలు, చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

click me!

Recommended Stories