మగవారిలో అలాంటి సమస్యలను తరిమికొట్టే వెలగపండు.. ఇది తీసుకుంటే శరీరంలో మార్పులు?

Published : Jun 07, 2022, 03:38 PM IST

గణపతికి ఎంతో ప్రీతికరమైన వెలగపండులో (Wood apple) అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి సుమారు 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి.  

PREV
110
మగవారిలో అలాంటి సమస్యలను తరిమికొట్టే వెలగపండు.. ఇది తీసుకుంటే శరీరంలో మార్పులు?

వెలగపండులో అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ పండును తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

210

వెలుగుపండే కాదు ఈ చెట్టు ఆకులు, పూలు, వేళ్లు బెరడు అన్నీ ఔషధ గుణాలను (Medicinal properties) మెండుగా కలిగి ఉంటాయి. ఈ పండును ఇంగ్లీష్ లో మంకీ ఫ్రూట్, కర్డ్ ఫ్రూట్, ఉడ్ యాపిల్ అని ఇలా పలు రకాలుగా పిలుస్తారు. ఇందులో కాల్షియం, పాస్ఫరస్ ఐరన్, పిండి పదార్ధాలు, నియాసిన్, సిట్రిక్ ఆమ్లంతో పాటు అనేక పోషక పదార్థాలు, క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వెలగపండును పోషకాల గని (Mine of nutrients) అని పిలుస్తారు. 

310

జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి: వెలగపండు గుజ్జులో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక జీర్ణ సంబంధిత సమస్యలతో (Digestive problem) బాధపడేవారు వెలగపండును జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పేగు సంబంధిత సమస్యలు (Intestinal problems) కూడా తగ్గుతాయి.
 

410

నులిపురుగుల్ని నాశనం చేస్తుంది: చాలామంది నులిపురుగుల (Worms) సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటివారు వెలగపండును తీసుకుంటే మంచిది. ఈ పండులో ఉండే పోషకాలు (Nutrients) కడుపులో ఉండే పరాన్న జీవులైన నులిపురుగుల్ని నాశనం చేస్తాయి. దీంతో నులిపురుగుల సమస్య తగ్గుతుంది.  

510

కాలేయ సమస్యలను తగ్గిస్తుంది: వెలగపండును తీసుకుంటే శరీరానికి కావలసిన బీటా-కెరోటిన్ (Beta-carotene) పుష్కలంగా లభిస్తుంది. దీంతో కాలేయ సమస్యలు తగ్గుతాయి. అలాగే కాలేయం ఆరోగ్యం (Liver health) కూడా మెరుగుపడుతుంది. కనుక కాలేయ సమస్యలతో బాధపడే వారు ఈ పండును తీసుకోవడం మంచిది.

610

స్త్రీల ఆరోగ్యానికి మంచిది: ఈ పండును స్త్రీలు క్రమం తప్పకుండా తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ (Cancer) లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో ఏర్పడే అసమతుల్యత సమస్యలు కూడా దూరమవుతాయి. పాలిచ్చే తల్లులు (Breastfeeding mothers) ఈ పండును తీసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

710

నోటి సమస్యలు తగ్గుతాయి: నోటిలో ఏర్పడే పుండ్ల సమస్యలను తగ్గించుకోవడానికి వెలగపండు గుజ్జుకు తేనె (Honey) కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఈ పండును తేనెతో కలిపి తీసుకుంటే అధిక దాహం (Excessive thirst) సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో నోటి ఆరోగ్యం కూడ మెరుగుపడుతుంది.

810

ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: గ్యాస్, ఎసిడిటీ (Acidity), మంట, అజీర్తి, వికారం వంటి సమస్యలను తగ్గించడానికి వెలగపండు గుజ్జును చక్కటి పరిష్కారం. కనుక వెలగపండు గుజ్జును తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గి ఉదర ఆరోగ్యం (Abdominal health) మెరుగుపడుతుంది.

910

పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుంది: వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం (Jaggery) కలుపుకుని తీసుకుంటే పురుషుల్లో నాణ్యమైన వీర్యం వృద్ధి (Semen growth) కలుగుతుంది. అలాగే వారిలో లైంగిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీంతో వారు రతిక్రీడను ఎక్కువ సేపు పాల్గొంటారు.

1010

అలాగే వీటితో పాటు ఈ పండును తీసుకుంటే రక్తహీనత (Anemia), గుండె జబ్బులు, కంటి సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు (Urinary problems) కూడా తగ్గుతాయి. కనుక ఇన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్న వెలగపండును తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

click me!

Recommended Stories