ఖర్జూరాలు
ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను నానబెట్టి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య పోతుంది. ఖర్జూరాలను నానబెట్టడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి కూడా ఖర్జూరాలు సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.