చిరుధాన్యాలతో మీ పిల్లలకు హెల్తీ స్నాక్.. ఎలా చెయ్యాలంటే?

Navya G   | Asianet News
Published : Jan 22, 2022, 04:37 PM IST

పిల్లలకు సరైన పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఇవ్వడం తల్లుల బాధ్యత. పిల్లలు చిరుతిండి పదార్థాలు వంటి జంక్ ఫుడ్స్ (Junk Foods) కు ఆకర్షితులవుతున్నారు. దానివల్ల వ్యాధినిరోధక శక్తి లోపించి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడడానికి పిల్లలకు ఎటువంటి స్నాక్స్ ను అందించాలని ఆలోచిస్తున్నారా! అయితే ఇంకెందుకు ఆలస్యం చిరుధాన్యాలతో చిక్కిలను (Chikki with cereals) తయారుచేసి పిల్లలకు ఇస్తేసరి. ఈ ఆర్టికల్ ద్వారా చిరుధాన్యాలతో చిక్కీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
15
చిరుధాన్యాలతో మీ పిల్లలకు హెల్తీ స్నాక్.. ఎలా చెయ్యాలంటే?

చిరుధాన్యాలతో తయారు చేసుకునే ఈ చిక్కిలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి (Immunity) పెంచుతుంది. ఇది హెల్తీ స్నాక్ (Healthy snack) ఐటమ్. ప్రస్తుత కరోనా కాలంలో ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ స్నాక్స్ ఐటమ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
 

25

కావలసిన పదార్థాలు: పావుకప్పు ఊదలు (barnyard millet), పావు కప్పు కొర్రలు (Korralu), ఒక స్పూన్ అవిసె గింజలు (Flax seeds), ఒక స్పూన్ బాదం (Almonds) పప్పులు, ఒక స్పూన్ తెల్ల నువ్వులు (White sesame), ఒక స్పూన్ గుమ్మడి గింజలు (Pumpkin seeds), రెండు స్పూన్ ల నెయ్యి (Ghee), చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), ఒక కప్పు బెల్లం (Jaggery) తరుగు.
 

35

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొర్రలను (Korralu) వేసి రోస్ట్ (Roast) చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే విధంగా ఊదలను కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన అవిసె గింజలు, బాదం పప్పు, తెల్ల నువ్వులను వేసి విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 

45

ఇప్పుడు స్టవ్ మీద మరల కడాయి పెట్టి అందులో బెల్లం తురుము, ఒక స్పూన్ నెయ్యి (Ghee), పావు కప్పు నీళ్లు (Water) వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత మీకు కావలసిన బెల్లం పాకం తయారవుతుంది. అయితే ఈ పాకాన్ని ఎలా పరీక్షించాలి (tested) అంటే బెల్లం పాకాన్ని నీటిలో వేస్తే కరిగిపోకుండా (Without melting) ఉండలా మారితే ఇది చిక్కీల తయారీకి అనువైన పాకం కింద లెక్క.
 

55

ఇప్పుడు ఈ బెల్లం పాకంలో (Jaggery caramel) వేయించిన చిరు ధాన్యాలు, పప్పులు, కొంచెం యాలకుల పొడి (cardamim powder) వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉండగానే ఒక ప్లేట్ కు నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. పైన నెయ్యి రాసిన బటర్ పేపర్ (Butter paper) ని ఉంచి చపాతీల కర్రతో ఒత్తితే చిక్కీలు సమానంగా వస్తాయి. చిక్కీ మిశ్రమం చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే చిరుధాన్యాల చిక్కీ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ స్నాక్ ను ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories