లీచీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ద్రాక్షతో పోలిస్తే వీటిలో పాలీఫినాల్స్ (Polyphenols) శాతం అధికంగా ఉంటుంది. మృదువైన ఈ పండ్ల గుజ్జును నేరుగా తినడంతో పాటు షర్బత్ లూ, జ్యూస్ లూ, ఐస్ క్రీమ్ ల తయారీలో వాడతారు.