Weight loss:ఎంత కాదు.. ఎప్పుడు తింటున్నాం అనేది ముఖ్యం..!

Published : Jun 18, 2022, 02:45 PM IST

మీరు తిన్నప్పుడు మీ ఆహారం ఎంత ముఖ్యమో... దానిని మనం ఏ సమయంలో తింటున్నాము అనే విషయం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమయానికి తగట్టు తీసుకుంటే.. శీరరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించవచ్చు.

PREV
19
Weight loss:ఎంత కాదు.. ఎప్పుడు తింటున్నాం అనేది ముఖ్యం..!

బరువు తగ్గడానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఎలా చేస్తే.. ఏం చేస్తే.. సులభంగా బరువు తగ్గొచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటే.. ఇది చాలా సులభమౌతుంది. మనం ఎంత వరకూ.. ఏం తింటున్నాం..? ఎంత తింటున్నాం అనే విషయాన్ని మాత్రమే చూస్తుంటాం. అయితే.. వీటికన్నా ముందు.. మనం ఎప్పుడు తింటున్నాం అనేది ఇంకా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనం తినే సమయాన్ని బట్టి.. బరువు పెరుగుతున్నామా..? తగ్గుతున్నామా చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం

29
weight loss

 మీరు తిన్నప్పుడు మీ ఆహారం ఎంత ముఖ్యమో... దానిని మనం ఏ సమయంలో తింటున్నాము అనే విషయం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమయానికి తగట్టు తీసుకుంటే.. శీరరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించవచ్చు.

39

పోషకాలతో నిండిన అల్పాహారం మీ శరీరానికి ఇంధనాన్ని నింపుతుంది. అంతేకాకుండా  మీ కండరాలకు తక్షణ శక్తిని అందించే గ్లైకోజెన్ నిల్వలను తిరిగి నింపుతుంది. అలా కాకుండా  రోజూ బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. అల్పాహారం రోజంతా ఆరోగ్యకరమైన ఎంపికలను చేయడానికి మీరు ట్రాక్‌లో ఉండటానికి సహాయపడుతుంది.

49

అల్పాహారం తినే వారు తమ ఆహారపు అలవాట్లపై ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. అల్పాహారం తీసుకోవడం వల్ల రోజులో మీ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా రోజులో అతిగా తినకుండా నివారించవచ్చు. అల్పాహారం సరిగా తినడం వల్ల.. మనకు స్వీట్లు, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగకుండా ఉంటుంది.

59

 బరువు తగ్గడంతో సహా ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఆరోగ్యకరమైన వ్యక్తులు రాత్రి భోజనం, మరుసటి రోజు వారి మొదటి భోజనం మధ్య కనీసం 12 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఉదయం 7, 9 గంటల మధ్య, చాలా మంది ప్రజలు తమ గుడ్లు లేదా తృణధాన్యాలు తినడానికి కూర్చుంటారు. దీని అర్థం వారు ఎక్కువ కాలం తింటున్నారు, కేలరీల వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది.

69

అలా కాకుండా అల్పాహారం తీసుకోకుండా... మధ్యాహ్నం వరకు ఎలాంటి భోజనం చేయకుండా ఉండటం వల్ల...  ఏవైనా స్వీట్స్, జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక ఎక్కువగా పెరుగుతుంది. 
 

79

అలా కాకుండా.. నిద్ర లేచిన గంటలోపే అల్పాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఇతర ఆహారాలు తినాలనే కోరిక కలగదు. దీని వల్ల చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా లేచిన గంటలోపే అల్పాహారం తీసుకోవడం ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత మధ్యాహ్న భోజనం చేయాలి. 

89

మీరు మీ అల్పాహారంలో భాగంగా ఎక్కువ శుద్ధి చేసిన పిండి పదార్థాలు, సంతృప్త కొవ్వులు లేదా ఎక్కువ చక్కెరతో కూడిన అల్పాహారం తినకూడదు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న, అనారోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉన్న, పీచుపదార్థాలు, కేలరీలు తక్కువగా ఉండే మొత్తం ఆహారాలు తీసుకోవాలి.

99

మీరు ఏమి తాగుతున్నారు అనేది కూడా ముఖ్యమైనది. మీరు బరువు తగ్గాలనుకుంటే, మీ అల్పాహారంతో పాటు ఉదయం పూట పుష్కలంగా నీరు త్రాగాలి. అల్పాహారం చేయడానికి ముందు కూడా కచ్చితంగా నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
 

click me!

Recommended Stories