జామకాయను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Jul 13, 2023, 12:54 PM IST

జామకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి2, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జామకాయను రోజూ తింటే..  

PREV
19
జామకాయను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?
Image: Getty Images

మన పొలాల్లో ఎక్కువగా దొరికే పండ్లలో జామపండు ఒకటి. నిజానికి జామకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి జామకాయ మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోజూ జామకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

29
Image: Getty Images

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. 
 

39

జీర్ణ సమస్యలు దూరం

జీర్ణ సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే జామకాయ ఈ సమస్యలను దూరం చేయడానికి బాగా సహాయపడుతుంది. జామపండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

49

క్యాన్సర్ నివారణ

జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి జామకాయలు ఎన్నో క్యాన్సర్ ప్రమాదాలను నివారించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జామకాయను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోండి. 
 

59

బ్లడ్ షుగర్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే జామపండు మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు జామకాయను క్రమం తప్పకుండా తినొచ్చు.
 

69

అధిక రక్తపోటు 

అధిక రక్తపోటును గుండెపోటు, స్ట్రోక్ కు దారితీస్తుంది. అయితే జామపండు హైబీపీ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. వీళ్లు జామకాయను తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

                                        

79

మెరుగైన కంటి చూపు

జామపండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ పండును రోజూ తింటే కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. అలాగే కళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

89

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి ఎన్నో రకాల పండ్లు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో  ఒకటి జామకాయ. ఈ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జామపండు తినడం వల్ల మనం తినే ఫుడ్ పరిమాణం తగ్గుతుంది. దీంతో మీరు లిమిట్ లోనే తింటారు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

99

చర్మ ఆరోగ్యం

జామపండు మన చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ జామపండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చర్మంపై ముడతలను నివారించడానికి సహాయపడుతుంది. జామకాయలో ఉండే ఇతర విటమిన్లు, మినరల్స్ చర్మానికి సరైన పోషణను అందిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories