HealthTips: సాధారణంగా ఎడమ చేయి నొప్పి అనగానే అందరూ హార్ట్ ఎటాక్ వస్తుందేమో అని భయపడుతుంటారు కానీ అన్నిసార్లు ఎడమ చేయి నొప్పి హార్ట్ ఎటాక్ కి దారి తీయదు. ఇతర కారణాల వల్ల కూడా ఆ నొప్పి వస్తుంది అవేంటో చూద్దాం.
సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎడం చేయి నొప్పి వస్తుందని ప్రజలందరిలోని ఉన్న ఒక నమ్మకం. అది నిజమే కానీ ఎడమ చేయి నొప్పి వచ్చిన ప్రతిసారి హార్ట్ ఎటాక్ కి అది ఒక సింప్టెం కాదు. ఇతర కారణాల వల్ల కూడా ఎడమ చేయి నొప్పి వస్తుంది.
26
కాబట్టి ముందు కంగారు పడకండి. ఆ నొప్పి దీనివల్ల వచ్చిందో ముందు నిర్ధారించుకోండి. ఎందుకంటే ఎడమ చేయి నొప్పి ఇతరత్రా కారణాల వల్ల కూడా వస్తుంది.అవేంటో ఇప్పుడు చూద్దాం.
36
నిద్రపోయే సమయంలో స్లీపింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా ఎడమ చేయి నొప్పి వస్తుంది. అలాగే కంప్యూటర్ దగ్గర కూర్చునేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ లేకపోయినా, శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోయినా నడుము చేయి నొప్పి వస్తుంది.
46
ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వాటిని దూరం చేసుకోవటం మంచిది ఎందుకంటే దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గి ముఖం పడుతుంది. కొన్నిసార్లు గ్యాస్, ఎసిడిటీ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
56
క్యాన్సర్ బాధితులలో కూడా ఎడమ చేయి నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి కారణం చికిత్స సమయంలో తీసుకునే కీమోథెరపీ మరియు నొప్పిని తగ్గించే డ్రగ్స్ ని ఎక్కువగా వాడటం వల్ల ఈ నొప్పి వస్తుంది.
66
కాబట్టి వైద్యుడిని సంప్రదించి ఎడమ చేయి నొప్పి దేనివల్ల వస్తుందో ముందు నిర్ధారించుకోండి తర్వాత దానికి తగిన చికిత్స తీసుకోండి అంతేగాని ముందే భయపడిపోకండి ఎందుకంటే అన్నింటికన్నా భయంకరమైన జబ్బు భయం.