Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు డిప్రెషన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఈ రెండింటికి సంబంధమేంటి అంటారా.. ఆ విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఆడవాళ్లు యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది అప్పుడప్పుడు కాకుండా తరచుగా వస్తే అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కి మానసిక సమస్యలకి సంబంధం ఉందని మీకు తెలుసా..
26
నిజమేనండి ఏకంగా 26 విభిన్న అధ్యయనాలలో ఇది రుజువైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ తో ఉన్నప్పుడు మూత్రాశయం ఓవర్ ఆక్టివ్ గా మారుతుందని దీనివల్ల మళ్లీ మళ్లీ మూత్రంకు వెళ్లాల్సిన అవసరం పడుతుందని చెప్తున్నారు వైద్యులు.
36
అలాగే యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల కొద్ది కడుపులో నొప్పి మూత్రం రంగు మారడం మూత్రం చెడు వాసన రావడం ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
46
అయితే వీటికి యాంటీబయోటిక్స్ వాడిన అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మళ్లీ మళ్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో నీటి స్థాయి తగ్గినప్పుడు యూరిన్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
56
అందుకే అలాంటి వాళ్ళు ఎక్కువగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే టీ, కాఫీలకి దూరంగా ఉండాలి. అల్లం కషాయం తీసుకోవడం వలన కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ని మళ్లీ మళ్లీ రాకుండా అడ్డుకోవచ్చు.
66
అలాగే ఆవిరి మీద ఉడికించిన వెల్లుల్లి రెబ్బలను తినటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు సరి కదా మళ్లీ మళ్లీ రాకుండా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే మానసిక సమస్యలు దరిచేరకుండా మెడిటేషన్ లాంటివి చేయడం వలన కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.