మనలో చాలా మంది ఖర్జూరాలను ఇష్టంగా తింటారు. కానీ అపుడప్పుడు మాత్రమే. కానీ వీటిని రెగ్యులర్ గా తినొచ్చు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ లో విటమిన్ సి, బి విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో పాటుగా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
dates
ఖర్జూరాలు ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ కు సహజ వనరు. ఖర్జూరాల్లో కరగని, కరిగే ఫైబర్స్ మెండుగా ఉంటాయి. ఈ ఫైబర్ మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మన రోజువారి ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు.
ఖర్జూరాల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి చాలా అవసరం. ఖర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మీ మొత్తం ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి కూడా ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలు పొటాషియానికి అద్భుతమైన వనరులు. పొటాషియం అనేది ఒక ఖనిజం. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. రక్తపోటు స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఖర్జూరాలు సహాయపడతాయి. అలాగే ఖర్జూరాల్లో ఉండే ఫైబర్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
ఖర్జూరాల్లో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. మీ రోజువారి ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం వల్ల మీ శరీరంలో ఇనుము లోపం ఉండదు. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, మంట తగ్గిపోతాయి. ఖర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.