చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published | Nov 6, 2023, 7:15 AM IST

నడక మన ఆరోగ్యానికి ఎన్నో విధాలు మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. అయితే చెప్పులు లేకుండా గడ్డిమీద నడవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందుతారని నిపుణులు అంటున్నారు. అవేంటంటే? 
 

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినడంతో పాటుగా శారీరక కార్యకలాపాలు కూడా ఖచ్చితంగా చేయాలి. బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది వ్యాయామాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారికే లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఏదేమైనా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మాత్రం మీరు శారీరకంగా ఫిట్ గా ఉండాలి. దీనికి సులభమైన మార్గం వాకింగ్. అవును వాకింగ్ కూడా మిమ్మల్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక ఎన్నోరోగాల ముప్పును తప్పిస్తుంది. కానీ మీరు చెప్పులు లేకుండా గడ్డిమీద నడిస్తే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రక్తపోటు, జీర్ణక్రియకు.. 

నేలపై చెప్పులు లేకుండా నడవడం వల్ల నాడీ వ్యవస్థ, సిర్కాడియన్ లయ నియంత్రణలో ఉంటాయి. దీంతో ఆరోగ్యకరమైన శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల విడుదల, జీర్ణక్రియ, రక్తపోటును మెరుగ్గా ఉంచుతుందని ఒక అధ్యయనం కనుగొంది.
 

Latest Videos


మంటను తగ్గిస్తుంది

చెప్పులు లేకుండా రెండు గంటల పాటు గడ్డిపై నడవడం వల్ల మంట తగ్గుతుందట. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని మరొక అధ్యయనం కనుగొంది. 
 

ఒత్తిడి నుంచి ఉపశమనం

చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రకృతి, భూమితో అనుసంధానంతో ఒత్తిడి స్థాయిలను తగ్గుతాయి. తగ్గించడానికి మరియు మీ మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 

మానసిక స్థితి మెరుగుదల

చాలా మంది గడ్డిపై నడిచినా, కొద్ది సేపు సమయం గడిపినా చాలా ప్రశాంతంగా ఉంటారు. సంతోషంగా అనిపిస్తారు. ఎందుకంటే గడ్డిపై నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది సహజ మూడ్ బూస్టర్ 
 

నొప్పి నుంచి ఉపశమనం

మీరు ఏదైనా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతుంటే.. గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. ఎందుకంటే ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే వాపు, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. 
 

click me!