బచ్చలికూరలో సి, ఎ, కె విటమిన్లతోపాటు క్యాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, ఇనుము, ఫొలెట్ వంటి ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. వీటితోపాటు కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడ ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధకశక్తిని (Immunity) పెంచి శరీరానికి హాని కలిగించే హానికర బ్యాక్టీరియాలను (Harmful bacteria) సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.