రాగి జావను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Published : Apr 07, 2022, 03:56 PM IST

శరీరానికి శక్తినందించే బలమైన ఆహారం రాగిజావ (Ragi java). రాగి జావలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.  

PREV
18
రాగి జావను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

శారీరక శ్రమ చేసేవారికి, క్రీడాకారులకు బలాన్ని అందించడానికి రాగి జావ సహాయపడుతుంది. రాగి జావను తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు (Health benefits) బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

రాగి జావలో క్యాల్షియం (Calcium), పీచుపదార్థం (Fiber), మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక రాగి జావను తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే తీసుకునే ఆహారంపై కూడా దీని ప్రభావం పడి, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునేలా చేస్తుంది.
 

38

దీంతో శరీరంలో అధిక కొవ్వు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. రాగులలో అమైనో ఆమ్లాలు (Amino acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడ్డ చెడు కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఈ హార్మోన్లు (Hormones) శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, అధిక బరువును సులభంగా తగ్గిస్తాయి.
 

48

కనుక రాగి జావను రోజూ తీసుకుంటే అధిక బరువు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, స్థూలకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రెండు పూటలా రాగి జావను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా రాగులలో ఉండే ఫైబర్ కంటెంట్ (Fiber content), పాలిఫినాల్స్ (Polyphenols) షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి.
 

58

రాగులు జీవక్రియను ఆలస్యం చేసి జీర్ణకోశం నుంచి రక్తంలో త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ (Glucose levels) వెళ్లకుండా చేస్తుంది. దీంతో షుగర్ వ్యాధి తీవ్రత తగ్గుతుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారు రాగి జావను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తహీనత సమస్యలతో బాధపడేవారు రాగి జావను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతాన్ని పెంచుతుంది.
 

68

రాగి జావను పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. రాగులలో వుండే క్యాల్షియం ఎముకల పెరుగుదలకు, ఎత్తు పెరగడానికి, దంతాలు ఆరోగ్యంగా (Dental health) ఉండడానికి సహాయపడుతుంది. అలాగే కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి కావల్సిన కాల్షియంను రాగి జావ అందిస్తుంది.
అంతేకాకుండా వయసుపై పడడంతో ఏర్పడే కీళ్ల నొప్పులు (Arthritis), మోకాళ్ళ నొప్పులను  తగ్గిస్తుంది.

78

ఇది ఎముకలను బలోపేతం చేసి ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ జావను తీసుకుంటే అధిక రక్తపోటు (High blood pressure) సమస్యలు కూడా తగ్గుతాయి. రాగులలో వుండే పోషకాలు ఒత్తిడి (Stress), ఆందోళన వంటి సమస్యలను తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే శరీర వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
 

88

రాగి జావను తీసుకుంటే జీర్ణాశయం, మలబద్ధకం, ఫైల్స్ (Files) వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్, మలాశయ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు (Cancers) కూడా దరిచేరవు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే రాగి జావను రెండు పూటలా తాగండి ఆరోగ్యంగా ఉండండి.

click me!

Recommended Stories