అందరిలో మీరే అందంగా కనిపించాలంటే ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి.. మేకప్ ఇలా వేసుకోండి!

Published : Apr 04, 2022, 02:18 PM IST

అందరిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే వేసుకునే మేకప్ పట్ల ప్రత్యేక శ్రద్ద తప్పనిసరి. మేకప్ (Makeup) ను తగిన మోతాదులో వేసుకున్నప్పుడే నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా (Attractive) కనిపిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
అందరిలో మీరే అందంగా కనిపించాలంటే ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి.. మేకప్ ఇలా వేసుకోండి!

మేకప్ ప్రొడక్ట్స్ (Makeup Products) ను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముందుగా మన చర్మతత్వానికి సరిపడే ప్రొడక్ట్స్ ను ఎంచుకోవాలి. వాటిని పరీక్షించుకుంటున్న తరువాతనే ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే మన చర్మానికి ఎటువంటి హాని (Harm) వాటిల్లదు.
 

28

చాలామంది లైట్ మేకప్ కంటే హెవీ గా మేకప్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ నిజానికి లైట్ గా మేకప్ చేసుకోవడమే చర్మానికి ఎంతో మంచిది. దీంతో చర్మం సహజసిద్ధమైన చర్మ సౌందర్యాన్ని (Skin beauty) కోల్పోదు. మేకప్ వేసుకొనే ముందు ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి.
 

38

మేకప్ కోసం ముందుగా చర్మతత్వానికి సరిపడే ప్రైమర్ ని ఎంచుకోవడం మంచిది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా (Bright) మార్చడానికి సహాయపడుతుంది. అలాగే ఒకే రకం ఫౌండేషన్ (Foundation) ను ముఖానికి అప్లై చేసుకోరాదు. ఒక రకం ఫౌండేషన్ కి మరోరకం హైలెటర్ ను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.
 

48

ముఖం మరింత అందంగా (Beautifully) కనిపించాలంటే బుగ్గలకు వేసుకునే మేకప్ పట్ల కూడా జాగ్రత్త వహించాలి. కనుక బుగ్గలు అందంగా సహజ సిద్ధమైన మెరుపుతో మెరిసిపోవాలంటే గులాబీ రంగు షేడ్ వేసుకోవడం మంచిది. గులాబీ రంగు నిగనిగలాడే బుగ్గలకు మరింత అందాన్ని తెస్తుంది.
 

58

అలాగే ముఖం మరింత అందంగా కనిపించాలంటే కళ్లకు కూడా మేకప్ తప్పనిసరి. కనుక కళ్లకు మస్కారా (Mascara) వేసుకుంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అదేవిధంగా కనుబొమ్మలు కూడా అందంగా నల్లగా, ఒత్తుగా కనిపించాలంటే ఓ చుక్క కొబ్బరి నూనెను (Coconut oil) అప్లై చేసి ఐబ్రోస్ తో సున్నితంగా దువ్వాలి.
 

68

ఇలా చేస్తే ముఖం మరింత అందంగా కనిపించేందుకు కనుబొమ్మలు సహాయపడతాయి. అలాగే ముఖానికి మరింత అందాన్ని తెచ్చే అధరాలకు మంచి లిప్ స్టిక్ (Lipstick) ను వేసుకోవడం మంచిది. అధరాలకు ముదురు రంగులు కాకుండా సహజంగా కనిపించేందుకు న్యూడ్ లిప్ స్టిక్ ను వేసుకుంటే బాగుంటుంది.
 

78

దీనికి పారదర్శకమైన లిప్ గ్లాస్ (Lip gloss) తో మెరుగులద్దితే సహజసిద్ధమైన  సౌందర్యంతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. అలాగే రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని నీటితో శుభ్రపరిచిన తరువాత మాయిశ్చరైజర్ (Moisturizer) ను రాసుకోవాలి. దీంతో చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.
 

88

ఇలా చాలా లైట్ గా మేకప్ చేసుకుంటే చర్మం సహజసిద్ధమైన మెరుపుతో మెరిసిపోతుంది. అలాగే చర్మానికి ఎటువంటి హాని కలగదు. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలను పాటిస్తూ మేకప్ చేస్తుంటే చర్మ సమస్యలకు (Skin problems) దూరంగా ఉంటూ అందంగా కనిపిస్తారు.

click me!

Recommended Stories