ఉదయాన్నే పరిగడుపున కరివేపాకు నీళ్లను తాగితే ఎంత మంచిదో తెలుసా?

First Published | Oct 7, 2023, 7:14 AM IST

పోషకాలు పుష్కలంగా ఉండే కరివేపాకు ఫుడ్ రుచిని పెంచడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్  సి, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే పరిగడుపున కరివేపాకు నీటిని తాగితే రెట్టింపు ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


కరివేపాకును ప్రతి వంటలో ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇది కమ్మని వాసన ఉంటుందని. అలాగే వంటలు కూడా టేస్టీగా అవుతాయని. కానీ చాలా మంది కూరలో కరివేపాకును తినకండి పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి కరివేపాకును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే  యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 

కరివేపాకుతో పాటుగా కరివేపాకు నీరు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవును ఈ కరివేపాకు నీటిని ఉదయాన్నే తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఈ వాటర్ డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. మరి ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీళ్లను తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

మన శరీరం ఫిట్ గా ఉండాలంటే మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలి. అయితే కరివేపాకులో మన జీర్ణశక్తిని పెంచే కొన్ని ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. అయితే  ప్రతిరోజూ ఉదయం కరివేపాకు నీటిని తాగితే ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. 
 

ఒత్తిడిని తగ్గించడంలో సహాయం

ఈ రోజుల్లో స్ట్రెస్ సర్వ సాధారణమైన సమస్యగా మారిపోయింది. కానీ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే కరివేపాకు ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. కరివేపాకు నీటిని తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంద. దీంతో మీరు ఎలాంటి ఒత్తిళ్లకు గురికారు. 
 

గుండె ఆరోగ్యం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీకు గుండెజబ్బులొచ్చే ముప్పు తగ్గుతుంది. 
 

డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం

కరివేపాకు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ ఆకులు కార్బజోల్ ఆల్కలాయిడ్ల  గొప్ప మూలం. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
 

click me!