వాముతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటో తెలుసుకోండి!

Navya G   | Asianet News
Published : Dec 09, 2021, 06:03 PM IST

పూర్వకాలంలో వాము (Ajwain) వినియోగం అధికంగా ఉండేది. ఇది అందరికీ ఇంటిలోనే అందుబాటులో ఉండే మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు.ఇది ఆరోగ్యానికి మేలు చేసే దివ్యౌషధమని వైద్యులు చెబుతున్నారు. వామును ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. పొడిచేసిన వాము వాసనను చూసిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా వాముతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం    

PREV
19
వాముతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటో తెలుసుకోండి!

అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది: వాము, బెల్లాన్ని నమిలి తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం (Digestion) అవుతుంది. అజీర్తి సమస్యలను (Indigestion problems) తగ్గించడానికి వాము ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

29

జలుబు, దగ్గు, ఆయాసంలను తగ్గిస్తుంది: స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాము (Ajwain), మెంతులను (Fenugreek) వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

39

గొంతు సమస్యలు తగ్గిస్తుంది: గొంతులో ఇన్ఫెక్షన్ (Infection) కారణంగా ఏర్పడిన సమస్యలను, గొంతు నొప్పులను (Throat problems) వెంటనే తగ్గించడానికి వాము చక్కగా పనిచేస్తుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలో ఉప్పు కలుపుకుని ఈ నీటితో నోరు పుక్కిలించడం చేయాలి.

49

విష జ్వరాలను తగ్గిస్తుంది: వాము విషజ్వరాలను (Toxic fevers) తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందుకోసం వాము, జీలకర్ర, ధనియాలను దోరగా వేయించుకొని పొడితో కషాయం (Infusion) తయారుచేసుకొని తాగితే విషజ్వరాల నుంచి విముక్తి కలుగుతుంది.
 

59

మద్యం సేవించాలని కోరికను తగ్గిస్తుంది: వాము (Fenugreek) నీటిలో కోడిగుడ్డు పచ్చసొన  (Egg yolk), తేనె (Honey)కలుపుకుని తాగితే మద్యం సేవించాలని కోరిక తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండ రోజుకి రెండు సార్లు తాగితే నాలుగు నెలల్లో మంచి ఫలితం ఉంటుంది.
 

69

అజీర్తి వాంతులను తగ్గిస్తుంది: వాము శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది. వాము నీటిలో వంటసోడా కలిపి తాగితే అజీర్తి కారణంగా ఏర్పడి వాంతులను (Vomiting) తగ్గిస్తుంది. అజీర్తిgd (Indigestion) సమస్యలను తగ్గిస్తుంది.
 

79

దంతాలను, చిగుళ్లను బలపరుస్తుంది: రోజూ కొద్ది మొత్తంలో ఆమెను నమిలి తింటుంటే దంతాలు, చిగుళ్లు బలపడతాయి. దంతాల (Teeth), చిగుళ్ల (Gums) సమస్యలను కూడా తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

89

ముఖం పై ఏర్పడిన మచ్చలను తగ్గిస్తుంది: ముఖం పై ఏర్పడిన మచ్చలను తగ్గించడానికి వాము వేసి చక్కగా పనిచేస్తుంది. వాము పేస్ట్ (Fenugreek paste) ను మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయడంతో మచ్చలు (Spots) తొందరగా తగ్గుతాయి.
 

99

ఉదర సమస్యలను తగ్గిస్తుంది: వామును మజ్జిగలో కలిపి తాగితే కడుపు ఉబ్బరం (Flatulence) వంటి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఉదర సమస్యలన్నింటినీ (Abdominal problems) తగ్గిస్తుంది.

click me!

Recommended Stories