Winter: చలికాలంలో.. మృదువైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు కి సింపుల్ చిట్కాలు..!

First Published Dec 20, 2021, 10:21 AM IST

మరి అలా రక్షించుకోవాలి అంటే.. కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి  ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల.. మనం అందంగా మెరిసిపోవచ్చో.. ఇప్పుడు చూద్దాం..

చలికాలంలో ఎంతైనా చాలా రొమాంటిక్ గా ఉంటుంది.  అందుకే.. చలికాలాన్ని చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు, చల్లని వాతావరణం.. ప్రజలను ఒక్కటి చేస్తుంది, ఆ సమయంలో... కుటుంబసభ్యుల మధ్య.. ప్రేమానుబంధాలు, అనుబంధాలు పెరుగుతాయి. ఇక.. ఈ శీతాకాలంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగానే జరుగుతాయనే చెప్పొచ్చు. సెలవలు, పండగలు..అంతా సందడిగా ఉంటుంది. అందుకే.. ఈ కాలాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. ఈ చలికాలంలో  చాలా మంది అసహ్యించుకునే ఒకే ఒక్క విషయం  జుట్టు, చర్మం.

ఈ చలికాలంలో.. చర్మం పగిలిపోతుంది.  పొడిబారిపోతుంది. ఇక... జుట్టు కూడా నిర్జీవంగా మారుతుంది. ఇక పెదాలు పగిలిపోతాయి.. గోళ్లు పెలుసులూడిపోతాయి. మొత్తానికి అందవిహీనంగా మారిపోతాం. మరి అలా కాకుండా ఉండాలంటే.. మన జుట్టు, చర్మాన్ని మనం కచ్చితంగా రక్షించుకోవాలి. మరి అలా రక్షించుకోవాలి అంటే.. కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి  ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల.. మనం అందంగా మెరిసిపోవచ్చో.. ఇప్పుడు చూద్దాం..

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరినూనె ఉత్పత్తులు  వాడాలని నిపుణులు సూచిస్తుున్నారు.  చర్మానికి, జుట్టుకి తేమ అందించడంలోనూ.. పోషకాలు అందించడంలోనూ.. ఈ కొబ్బరి నూనె సహాయ పడుతుంది. కాబట్టి.. జుట్టుకి కచ్చితంగా.. కొబ్బరినూనె ఉపయోగించాలి. కొబ్బరి నూనె  జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

డీప్ హెయిర్ కండిషనింగ్ కోసం, పడుకునే ముందు మీ తలకు కొబ్బరి ఆధారిత హెయిర్ ఆయిల్‌ను పుష్కలంగా అప్లై చేయండి. ఇది లోపలి నుండి తాళాలను పోషించడంలో సహాయపడుతుంది, ప్రోటీన్‌ను బలంగా చేయడానికి పునర్నిర్మిస్తుంది. కొబ్బరి ఆధారిత హెయిర్ ఆయిల్‌ను రాత్రిపూట లీవ్-ఇన్ కండీషనర్‌గా ఉపయోగించడం వల్ల ఉదయం చాలా తక్కువ ఫ్రిజ్‌తో మీ జుట్టు సిల్కీ-స్మూత్ ఫినిషింగ్‌ను అందిస్తుంది!

ఇక.. చలికాలంలో పెదాలు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పగిలి.. రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే..  కొబ్బరి ఆధారిత స్కిన్ ఆయిల్‌తో కొంచెం బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి, పెదవులపై వృత్తాకార కదలికలో తేలికగా రుద్దడం వల్ల పెదవులు మృదువుగా  తయారౌతాయి. వెంటనే, అదే కొబ్బరి ఆధారిత స్కిన్ ఆయిల్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేసిన పెదవులపై లిప్ బామ్‌గా రాయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.
 

ఇక.. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి కూడా.. కొబ్బరి నూనెను ఉపయోగించడం ఉత్తమం. ఈ చలికాలంలో మీ గోర్లు చక్కగా మరియు దృఢంగా ఉంచుకోవడానికి, మీ గోళ్లపై కొద్దిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పాడవవ్వకుండా ఉంటాయి.

మీ పాదాలకు కొబ్బరి ఆధారిత స్కిన్ ఆయిల్‌తో మసాజ్ చేయండి, కాటన్ సాక్స్‌లను ధరించండి. తర్వాత.. రాత్రిపూట నిద్రపోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పగిలిన మడమలు మృదువుగా మారతాయి. 

click me!