గోంగూర పప్పు ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. పిల్లలు ఇష్టంగా తింటారు!

First Published Aug 18, 2022, 3:11 PM IST

గోంగూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) అందిస్తాయి.
 

గోంగూరతో చేసుకునే వంటలు పుల్లపుల్లగా భలే రుచిగా ఉంటాయి. అందులోనూ గోంగూర పప్పు వేడి వేడి అన్నం, రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. తింటుంటే ఇంకాస్త తినాలనిపిస్తుంది. ఈ పప్పు తయారీ విధానం  సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం గోంగూర పప్పు (Gongura pappu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు (Red gram), ఒక కట్ట గోంగూర (Gongura), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), నాలుగు టమోటాలు (Tomatoes), పదిహేను పచ్చి మిరపకాయలు (Green chilies), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt).
 

పది వెల్లుల్లి (Garlic) రెబ్బలు,  కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులో  కడిగిన కందిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిరపకాయలు, గోంగూర, టమోటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, ఒక స్పూన్   నూనె (Oil), మూడు గ్లాసుల నీళ్లు (Water) పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 

కుక్కర్ విజిల్స్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ (Whistles) వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి (Steam) పోయాక మూత తీసి పప్పు గిత్తతో పప్పును మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడేక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై  చేసుకోవాలి.
 

తరువాత కరివేపాకు రెబ్బలు, ఎండు మిరపకాయలను వేసి ఫ్రై చేసుకుని పప్పుకు పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర పప్పు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గోంగూరతో పప్పును ట్రై చేయండి. ఈ పప్పు చాలా రుచిగా ఉండడంతో మీ పిల్లలు మళ్లీమళ్లీ అడిగి చేయించుకుని తినడానికి ఇష్టపడతారు (Likes to eat). గోంగూరలో ఉండే పోషకాలు (Nutrients) రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.
 

అలాగే గుండె ఆరోగ్యానికి (Heart Health), రక్తహీనత సమస్యలను (Anemia problems) తగ్గించడానికి, కంటి సమస్యలను తగ్గించడానికి, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇలా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక గోంగూరతో వెరైటీ వంటలను ట్రై చేయండి.. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రుచులను ఆస్వాదిస్తూ.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి..

click me!