చేతులను కడుక్కోవడం వల్ల ఎన్ని రోగాల ప్రమాదం తప్పుతుందో తెలుసా?

R Shivallela | Updated : Oct 16 2023, 07:15 AM IST
Google News Follow Us

చేతులు మురికిగా ఉంటే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. అందుకే చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యమంటారు నిపుణులు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను కూడా నిర్వహిస్తున్నారు. చేతులను కడుక్కునే అలవాటు ఎన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందో తెలుసా? 
 

15
 చేతులను కడుక్కోవడం వల్ల ఎన్ని రోగాల ప్రమాదం తప్పుతుందో తెలుసా?
global hand washing day

ప్రతి ఏడాది అక్టోబర్ 15 న "గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే" ను జరుపుకుంటారు.  ఈ రోజు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ రోజును గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ పార్ట్నర్స్ 2008 సంవత్సరంలో ప్రారంభించింది. సబ్బుతో కనీసం 30 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం మంచిదని నిపుణులు చెబుతారు. దీనివల్ల కలరా, డయేరియా, పోషకాహార లోపం, కడుపులో పురుగులు, న్యుమోనియా, కోవిడ్ వంటి ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. భోజనానికి ముందు, వాష్ రూం ను, టాయిలెట్ ను యూజ్ చేయిన తర్వాత ఖచ్చితంగా చేతులను సబ్బుతో కడగాలి.  చేతులను కడగడం ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25
hand wash

విరేచనాల ప్రమాదం తగ్గుతుంది

డయేరియా, విరేచనాలు, పేగు ఇన్ఫెక్షన్లకు మురికి, అపరిశుభ్రమైన ఆహారమే అతిపెద్ద కారణమంటున్నారు నిపుణులు. అందుకే మురికి చేతులతో ఫుడ్ ను తినకూడదు. ఇలా తిన్నా.. చెడు ఆహారాలను తిన్నా కడుపునకు సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. 

35

కంటి ఇన్ఫెక్షన్ల నివారణ

కంటి ఇన్ఫెక్షన్లు  రావడానికి ప్రధాన కారణం శుభ్రంగా లేని చేతులతో కళ్లను తాకడం. దీనివల్ల కళ్లలో చికాకు, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. అందుకే కళ్లను తాకే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కళ్లలో విపరీతమైన దురద లేదా ఏదైనా చెత్త పడ్డప్పుడు మెత్తని క్లాత్ ను ఉపయోగించండి.

Related Articles

45
hand wash

శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నివారణ

దగ్గినా, తుమ్మినా ఆ వెంటనే చేతులను కడుక్కోండి. ఇలా చేయకపోతే ఈ సమస్యలు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎందుకంటే మీరు తుమ్మిన తర్వాత ఇతరులుకు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల మీ చేతులకున్న బ్యాక్టీరియా, వైరస్లు మీ నుంచి మరొకరికి చేతులకు వ్యాపిస్తాయి.

55
Hand washing Day

స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారణ

చర్మం సున్నితంగా ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మురికి చేతులతో చర్మాన్ని తాకడం వల్ల దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీరు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.

Read more Photos on
Recommended Photos