నైట్ షిఫ్ట్ లో పనిచేస్తే ఆ సమస్య వస్తుందా?

R Shivallela | Updated : Oct 17 2023, 10:02 PM IST
Google News Follow Us

ప్రస్తుత కాలంలో పనివల్ల మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇకపోతే డే షిఫ్టులతో పాటుగా నైట్ షిఫ్ట్ లు కూడా ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని వారాలు డే షిఫ్ట్ లు, కొన్ని వారాలు నైట్ షిఫ్టులు పని చేస్తుంటారు చాలా మంది. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. తాజా అధ్యయనం నైట్ షిఫ్ట్ విషయంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. 
 

16
నైట్ షిఫ్ట్ లో పనిచేస్తే ఆ సమస్య వస్తుందా?

మారుతున్న కాలానికి అనుగుణంగా మన పని విధానం, జీవనశైలి కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. ఇక ఈ రోజుల్లో పగలుతో పాటుగా నైట్ షిఫ్ట్ పనుల ట్రెండ్ కూడా బాగి పెరిగిపోయింది. చాలా మంది నైట్ షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. కానీ నైట్ షిఫ్ట్ లో పనిచేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా దీనిపై ఓ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. దీనిలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 

26

అధ్యయనం ఎక్కడ జరిగింది?

యునైటెడ్ కింగ్ డమ్ లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో రాత్రంతా మేల్కొని ఉండటం, తప్పుడు సమయంలో ఆహారాలను తినడం వల్ల మన ఆకలి, ఆహారపు అలవాట్లు మారిపోతాయని, దీని ఫలితంగా బరువు పెరుగుతారని వెల్లడైంది. ఈ అధ్యయనం కమ్యూనికేషన్స్ బయాలజీ జర్నల్ లో ప్రచురితమైంది.
 

36
night shift

అధ్యయనం ఏం చెబుతోందంటే..

అర్థమయ్యేట్టు చెప్పాలంటే నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల శరీరం జీవ గడియారానికి అంతరాయం కలిగిస్తుంది. దీనిని సిర్కాడియన్ పొరపాటు అని కూడా పిలుస్తారు. బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం.. పేలవమైన శరీర గడియారం ఆకలిని నియంత్రించే హార్మోన్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు.
 

Related Articles

46

ఈ విషయాలను గుర్తుంచుకోండి

నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు పగటిపూట పనిచేయడానికి ప్రయత్నించాలి. అలాగే గుండె  ఆరోగ్యంగా ఉండటం కోసం వ్యాయామం చేయాలి. భోజన సమయాలను నియంత్రించాలి. మీరు కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేస్తే మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఈ చిట్కాలను పాటించండి. 

56

నైట్ షిఫ్టుల్లో పనిచేస్తే పగటిపూట కంటినిండా నిద్రపోండి. 
నైట్ షిఫ్ట్ లో పనిచేయడానికి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 
హెవీగా తినడం మానుకోండి. ఎందుకంటే ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

66

రాత్రిపూట పనిచేస్తుంటే మధ్యమధ్యలో రెస్ట్ తీసుకోండి. ఇది మిమ్మల్ని సౌకర్యంగా ఉంచుతుంది. అలాగే బాగా పనిచేస్తారు కూడా. 
నైట్ షిఫ్టులు చేసే వ్యక్తులు రోజంతా నీటిని పుష్కలంగా తాగాలి. అప్పుడే రాత్రంతా హైడ్రేట్ గా ఉండగలుగుతారు.
రాత్రిపూట పని చేసేటప్పుడు తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోండి.

Read more Photos on
Recommended Photos