నాలుకపై నల్ల మచ్చలు ఉన్నాయా.. అయితే ఇంటిలోనే సులభంగా వదిలించుకోండిలా!

First Published Jan 21, 2022, 12:58 PM IST

మన ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి డాక్టర్లు మొదట నాలుకను (Tongue) పరీక్షిస్తారు. నాలుక రంగును బట్టి మనలోని ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. కనుక నాలుక ఆరోగ్యానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అనారోగ్యం చేసినప్పుడు లేదా ఇతర కారణాల కారణంగా నాలుకపై నల్ల మచ్చలు (Black spots) ఏర్పడుతుంటాయి. ఇలా ఏర్పడిన మచ్చలను తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

నాలుక చర్మకణాలలో బ్యాక్టీరియా (Bacteria) పెరిగినప్పుడు నాలుక రంగు మారడం, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా నోటి రుచిని కోల్పోతాము. సాధారణంగా నాలుక గులాబీ రంగులో ఉంటుంది. నాలుకను ఆరోగ్యంగా (Tongue health) ఉంచుకోవడానికి ఇంటిలోనే కొన్ని ఉత్తమమైన పద్ధతులను ఉపయోగిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

దాల్చిన చెక్క, లవంగాలు: దాల్చిన చెక్క (Cinnamon), లవంగాలలో (Cloves) ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి నాలుకపై ఏర్పడిన నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో రెండు దాల్చిన చెక్క ముక్కలు, నాలుగు లవంగాలు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఈ నీటితో నోటిని పుక్కిలిస్తే నాలుకపై నల్ల మచ్చలు తగ్గిపోతాయి.
 

వెల్లుల్లి: వెల్లుల్లి (Garlic) క్రిమిసంహారిణిగా (Disinfectant) సహాయపడుతుంది. కనుక నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను నశింపచేసి నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం నాలుకపై ఉన్న నల్లటి మచ్చలపై వెల్లుల్లి రెబ్బలను రుద్దితే మీరు ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు.
 

పైనాపిల్: పైనాపిల్ (Pineapple) లో ఉన్న బ్రోమెలైన్ (Bromelain) నల్ల మచ్చలను తొలగించడంతో పాటు మృతకణాలను తొలగించి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక రోజూ పైనాపిల్ ను తింటే కొద్దిరోజుల్లోనే నల్లమచ్చలు తేలికగా తగ్గిపోతాయి.
 

కలబంద: కలబంద (Aloevera) కొలాజిన్ (Collagen) నిర్మాణాన్ని మెరుగుపరిచి వేగంగా నల్ల మచ్చలను నయం చేయడానికి సహాయపడుతుంది. కనుక కలబంద గుజ్జును నాలుకపై నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గే అవకాశం. కలబంద జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. 
 

వేప: వేపలో (Neem) ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్ (Infection) లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కనుక ఒక గ్లాసు నీటిలో వేపాకులను వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే నాలుకపై ఏర్పడ్డ నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: మన జీవనశైలిలోని కొన్ని చెడు అలవాట్ల (Bad habits) కారణంగా కూడా నాలుకపై నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మద్యపానం, పొగాకు (Tobacco) వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. అప్పుడే నాలుక ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.

click me!