గుండె సమస్యలను తరిమికొట్టే జొన్నలు.. ఇలా తింటే ఆరోగ్యమే ఆరోగ్యం!

First Published Jan 20, 2022, 4:42 PM IST

గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత భారతదేశంలో ఎక్కువగా పండించే పంట జొన్నలు (Sorghum). జొన్నలలో మినరల్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

జొన్నలలో కాల్షియం, జింక్, పొటాషియం, పాస్పరస్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్ (Folic acid) వంటివి కూడ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉంచుతాయి.
 

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి: జొన్నలో పీచు పదార్థం (Fiber), ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ (Digestive system) సక్రమంగా పని చేయడానికి సహాయపడుతాయి. దీంతో మలబద్దకం సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
 

క్యాన్సర్ ను తగ్గిస్తాయి: జొన్నలలో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ విరుగుడుగా సహాయపడుతాయి. దీంతో క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చర్మ కేన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు కూడా దరిచేరవు.
 

ఉదర సమస్యలను తగ్గిస్తాయి: జొన్నలలో ఉండే పోషకాలు ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ (Gastric problem) వంటి ఉదర సమస్యలకు (Abdominal problems) దూరంగా ఉండవచ్చు . ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జొన్నలను తీసుకుంటే ఉదరభాగం రిలాక్స్ గా ఉంటుంది.
 

ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతుంది: జొన్నలలో కాల్షియం, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ (Folic acid), రక్తాన్ని పెంచే ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జొన్నలు శరీరానికి శక్తినందించే మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడతాయి.
 

పాలిచ్చే తల్లులకు మంచిది: జొన్నలు బలవర్ధకమైన ఆహారం (Fortifying food). పాలిచ్చే తల్లులు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే తల్లితో పాటు బిడ్డకు కూడా మంచిది. వీటిలో ఉండే పోషకాలు తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని (Health) మెరుగుపరుస్తాయి.
 

మధుమేహగ్రస్తులకు మంచిది: జొన్నలలో ఉండే పోషకాలు షుగర్ లెవెల్స్ (Sugar levels) రక్తంలో కలవకుండా అడ్డుకొని మధుమేహాన్ని (Diabetes) నియంత్రణలో ఉంచుతాయి. కనుక జొన్నలు మధుమేహగ్రస్తులకు మంచి హెల్దీ ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు.
 

అంతేకాకుండా జొన్నలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు (Cardiovascular diseases), టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. జొన్నలను తీసుకుంటే బరువు నియంత్రణలో (Weight control) ఉంటుంది. కనుక ఇన్ని పోషకాలు కలిగిన జొన్నలను మన ఆహార జీవనశైలిలో భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

click me!