పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు ఇవే!

Navya G   | Asianet News
Published : Jan 20, 2022, 03:25 PM IST

స్కూల్ కి వెళ్ళే పిల్లలు, ఆఫీసుకు వెళ్లే వారు ఇలా రోజూ ఎక్కువసేపు షూస్ ధరించడంతో పాదాల దగ్గర చెమట (Sweat) ఉత్పత్తి అయ్యి పాదాలకు గాలి తగలక ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా ఏర్పడి దుర్వాసన వస్తుంటుంది. కనుక పాదాల దుర్వాసనను (Foot odor) తగ్గించుకోవడానికి ఇంటిలోనే సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగిస్తే దుర్వాసనను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు ఇవే!

పాదాల దుర్వాసనను తగ్గించడానికి కొబ్బరి నూనె (Coconut oil) దివ్యౌషధంగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో లారిక్‌ యాసిడ్‌ (Lauric acid) ఉంటుంది. ఇది పాదాల దగ్గర పేరుకుపోయిన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది. కనుక రాత్రి నిద్రకు ముందు పాదాలకు కొబ్బరి నూనెతో పది నిమిషాల పాటు మర్దన చేసుకుంటే పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. 
 

26

బియ్యం కడిగిన నీటిలో ఔషధ గుణాలు (Medicinal properties) మెండుగా ఉంటాయి. ఇవి పాదాల దుర్వాసనను తగ్గించడానికి సహాయపడతాయి. కనుక బియ్యం కడిగిన నీటిలో (Rice washed water) పదిహేను నిమిషాలపాటు పాదాలను ఉంచితే పాదం దగ్గర చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు నశించి పాదాల దుర్వాసన తగ్గుతుంది. 
 

36

షూస్‌ ధరించేటప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని (Corn flour) చల్లుకోవాలి. మొక్కజొన్నపిండి పాదాల దగ్గర ఏర్పడే చెమటను పీల్చుకుంటుంది (Absorbs). దీంతో పాదాలు పొడిగా ఉంటాయి. మొక్కజొన్నపిండి పాదాల దగ్గర బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకొని పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది.
 

46

యాపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు  పాదాల దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇది పాదాల దగ్గర ఉన్న బ్యాక్టీరియాను (Bacteria) నశింపచేసి దుర్వాసనను తగ్గిస్తుంది. కనుక ఒక బకెట్‌ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి ఆ నీటిలో పాదాలను ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
 

56

పాదాల దుర్వాసన తగ్గించుకోవడానికి లావెండర్ ఆయిల్ (Lavender oil) ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజూ నిద్రించేముందు లావెండర్ ఆయిల్ ను పాదాలకు సున్నితంగా మర్దన (Massage) చేసుకుంటే పాదాలపై ఉండే బ్యాక్టీరియా నశించి పాదాల దుర్వాసన తగ్గుతుంది. ఈ ఆయిల్ పాదాల దుర్వాసన తగ్గించడంతో పాటు మంచి సువాసన కూడా అందిస్తుంది.
 

66

ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు కప్పుల ఎప్సమ్‌ సాల్ట్‌ (Epsom salt) వేసి కలుపుకోవాలి. ఈ నీటిలో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజు చేస్తే పాదాల దగ్గర పేరుకుపోయిన మృత కణాలు (Dead cells) నశిస్తాయి. దీంతో పాదాల దగ్గర చర్మకణాలు శుభ్రపడి పాదాల దుర్వాసన తగ్గుతుంది. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!

Recommended Stories