Exercise: ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఇవి అస్సలు తినకూడదు

Exercise: ఈ రోజుల్లో ఎక్సర్‌సైజ్ రెగ్యులర్ గా చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. అయితే వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ తినడం హెల్త్ కి మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం స్ట్రాంగ్ గా ఉండాలి. దీని కోసం ఎక్కువ మంది వ్యాయామం చేస్తారు. దీని వల్ల శరీరం బలంగా మారడమే కాకుండా, మానసికంగా కూడా స్ట్రాంగ్ గా మారవచ్చు. అయితే వ్యాయామం చేసే క్రమంలో కొందరు కొన్ని పొరపాట్లు చేస్తారు. దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ఎక్సర్‌సైజ్  చేయడం మానేస్తారు. ముఖ్యంగా ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొన్ని రకాల ఆహారాలు తినడం మంచిది కాదని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు. జిమ్ చేసిన తరువాత ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

మీరు బరువు తగ్గాలని జిమ్ కి వెళ్లి ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా? అయితే వ్యాయామం చేసిన తర్వాత నాన్ వెజ్ వినడం మంచిది కాదు. జనరల్ గా నాన్ వెజ్ తింటే ఎక్కువ బలం వస్తుందంటారు. కాని వ్యాయామం చేసిన వెంటనే తినడం మంచిది కాదు. 

అదేవిధంగా ఎక్సర్‌సైజ్ చేసిన వెంటనే బాగా కూల్ వాటర్ తాగకూడదు. దీని వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని నార్మల్ వాటర్ తాగాలి. అది కూడా కొద్దిగానే తాగాలి. లీటర్ నీరు ఒకేసారి తాగకూడదు. 
 


ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఆకలేస్తోందని వెంటనే ఫ్రైడ్ రైస్, చిప్స్ లాంటి వేయించిన ఆహారాలు తినకూడదు. ఇవే కాకుండా వేరుశనగతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. 

అదేవిధంగా జిమ్ కి వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో ఉండే స్వీట్లు తినేయకూడదు. వీటిల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వేడిగా ఉండే మీ బాడీపార్ట్స్ పై  చక్కర ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో చెడు ఫలితాలు బయటపడతాయి.
 

ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత దాహంగా ఉందని కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. వీటిల్లో కూడా చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ బదులు షుగర్ వేయని పండ్ల రసాలు తాగితే మంచిది.

వ్యాయామం చేసిన తర్వాత ఆమ్లెట్ తినకూడదు. అదేవిధంగా ఎగ్స్ ని వేయించుకొని కూడా తినకూడదు. బలం కోసం తినాలనుకుంటే గుడ్లను ఉడకబెట్టి తినడం మంచిది. 

ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు జిమ్ లో పడిన కష్టానికి అస్సలు ప్రతిఫలం దక్కదు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్, ఇతర కొవ్వు పదార్థాలు త్వరగా శరీరంలోకి చేరిపోతాయి. అవి అంత ఈజీగా కరగవు. మనం ఎక్సర్‌సైజ్ చేసేది కొవ్వుకరిగించుకోవడానికైతే  ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. 

ఇది కూడా చదవండి వేసవిలో కర్బూజ రోజూ తింటే ఏమవుతుంది?

Latest Videos

click me!