బరువు పెంచుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

First Published Jun 30, 2022, 3:31 PM IST

కొందరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే మరికొందరేమో బరువు తక్కువతో బాధపడుతుంటారు.
 

శరీరం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలన్న తగినంత బరువు ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా (Healthy), బలంగా (Strongly) ఉంటారు. ఉండవలసిన బరువుకన్నా చాలా తక్కువగా ఉంటే చూసేవారికి అస్తిపంజరంలా కనిపిస్తారు. శరీర ఆకృతి అందంగా కనిపించదు. మరి బరువును పెంచుకోడానికి ఎటువంటి ఆహారపు జీవనశైలిని అలవర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ఉండవలసిన బరువు కంటే చాలా తక్కువగా బరువు ఉన్నప్పుడు బరువును పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అధిక బరువు ఉన్న వారిని అడిగి ఏ పదార్థాలను తీసుకుంటే బరువు పెరుగుతారో (Gain weight) అడిగి తెలుసుకుంటారు. కానీ బరువును పెంచుకోవాలంటే ఆరోగ్యకరమైన పద్ధతిలో (Healthy method) పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 

ఆరోగ్యకరంగా ఉండవలసిన బరువును పెంచుకోవాలంటే తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపాలి. ఇందుకోసం మంచి పౌష్టిక ఆహారాన్ని (Nutritious food) రోజువారి ఆహారపు జీవనశైలిలో అలవర్చుకోవాలి. అప్పుడే బరువు, బలం పెరుగుతుంది. అయితే బరువును పెంచుకోవడం కోసం మద్యం సేవించడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువసేపు నిద్రపోవడం, శరీరానికి శారీరక శ్రమను అందించకపోవడం వంటి చెడు అలవాట్లను (Bad habits) పాటించడం మంచిది కాదు.
 

ఆరోగ్యకరమైన పద్దతిలో బరువును పెంచుకుంటే శరీరానికి బలం, కండ పుష్టి (Muscle strength) లభిస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని (Healthy living) గడపవచ్చును. ఇందుకోసం మనం రోజూ తీసుకునే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రపు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరుగుతారో ఆ నియమాలను పాటిస్తే మంచిది.
 

ఉదయం పూట ఉప్మా, ఇడ్లీ, దోస వంటి  అల్పాహారాలకు బదులుగా రాత్రంతా నీళ్లలో  నానబెట్టిన వేరుశెనగ (Soaked peanuts) పప్పులను రెండు గుప్పెళ్లు తీసుకోవాలి. నూరు గ్రాముల వేరుశనగలో 567 క్యాలరీలు ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే శరీరానికి అరకేజీ మేక మాంసం తిన్న బలం అందుతుంది. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వేరుశెనగలో జీరో కొలెస్ట్రాల్ (Zero cholesterol) ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
 

అలాగే శరీరానికి కావలసిన శక్తి పుష్కలంగా లభిస్తుంది. వేరుశనగ పప్పులను తిన్న తరువాత మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటే కండర పుష్టికి, బరువు పెరగడానికి చాలా మంచిది. ఇవి శారీరక శ్రమ చేసే వారికి, క్రీడాకారులకు శక్తినందించే బలమైన పౌష్టికాహారం. అలాగే వీటితో పాటు పచ్చికొబ్బరి (Coconut) తురుమును తేనెతో (Honey) కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.
 

వీటితోపాటు అరటి, సపోటా, మామిడి, పనస, సీతాఫలం వంటి పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లలో క్యాలరీలు, శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి బరువును పెంచే మంచి ఆహారం.

మధ్యాహ్నం భోజనంలో పాలిష్ పట్టిన బియ్యంకి బదులుగా ముడి బియ్యం, ఎర్ర గోధుమల రవ్వ, కొర్రలు వంటి వాటితో అన్నం వండుకోవాలి. కంది పప్పు (Red gram), పెసరపప్పు (pesarapappu), ఆకుకూరలను కూరలలో ఎక్కువగా ఉపయోగించాలి. భోజనం చేశాక వేరుసెనగ ఉండల, నువ్వుల ఉండలు తీసుకోవాలి.

సాయంత్రం సమయంలో చపాతి, అన్నానికి బదులుగా పచ్చికొబ్బరి తురుము, ఉదయం విడివిడిగా నానబెట్టుకున్న పది చొప్పున జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వంటి డ్రై ఫుడ్స్ (Dry foods) ను తీసుకోవాలి. అలాగే పది ఎండు ఖర్జూరాలు (Dates) వీలైతే అరటిపండు, సపోటా వంటి పండ్లను తీసుకోవాలి. ఇలా మూడు పూటలా ఆహారపు జీవనశైలిని నెల రోజుల పాటు అనుసరిస్తే ఆరోగ్యకరంగా నెలకు రెండు కేజీలు పెరుగుతారు.

click me!