
ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే శరీరంలోని ఒక్కొక్క అవయవం దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు (Health problems) తలెత్తుతాయి. కనుక షుగర్ వ్యాధిని నియంత్రించుకోవడానికి, శాశ్వతంగా తగ్గించుకోవడానికి మనం తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి ఎటువంటి ఆహార నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
షుగర్ వ్యాధి నియంత్రణకాకపోవడంతో కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, లైంగిక సమస్యలు, కాళ్ల నొప్పులు, స్పర్శ జ్ఞానం కోల్పోవడం, గాయాలు మానకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం (Decreased immunity), నీరసంగా అనిపించడం, దంతాల సమస్యలు, గుండె సమస్యలు (Heart problems) వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. ఈ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే షుగర్ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్త పడాలి.
ఒకవేళ వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే షుగర్ వ్యాధికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా (Healthy) ఉండవచ్చు. షుగర్ వ్యాధి రావడానికి మనం తీసుకునే ఆహార జీవనశైలి ముఖ్య కారణం. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు (Carbohydrates) తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలిష్ పట్టిన తెల్లటి అన్నాన్ని ఎక్కువగా తీసుకోరాదు.
ఎందుకంటే వీటిలో మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ క్యాన్సర్ (Anti cancer) వంటి ఇతర పదార్థాలు ఉండవు. అన్ని ధాన్యాల కంటే పాలిష్ పట్టిన బియ్యంలోనే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధికి కారణం అవుతాయి. కనుక షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి శారీరక శ్రమ చేసే కూలీలు పాలిష్ పట్టిన తెల్లటి అన్నానికి బదులుగా గోధుమ అన్నం, రాగి ముద్ద, కొర్ర అన్నం, జొన్న అన్నం వంటివి తీసుకోవచ్చు.
అయితే అన్నాన్ని తక్కువగా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. అదే ఆఫీసు పనులు చేసేవారు, శారీరక శ్రమ తక్కువ చేసేవారు అన్ని రకాల అన్నాన్ని తినకపోవడమే మంచిది. వీరు మధ్యాహ్నం, సాయంత్రం పుల్కాలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలను ఎక్కువ కూరలతో (With more curries) తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఆకుకూరలలో, కూరగాయలలో (Vegetables) కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
కనుక తీసుకునే ఆహారంలో ఒకవంతు అన్నం, పుల్కాలు, రొట్టెలు ఉంటే మూడువాంతుల కూర ఉండేలా చూసుకోవాలి. అలాగే వంటలలో నూనె, మసాలా, ఉప్పు తక్కువగా వాడుకోవాలి. ఇలా వంటలను వండుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels) పెరగకుండా ఉంటాయి. అలాగే ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, దోసెలకు బదులుగా మొలకెత్తిన గింజలు (Sprouted seeds), పండ్లు తీసుకోవాలి.
ఇందులో మంచి మాంసకృత్తులు, కొవ్వులు, తక్కువ కార్బోహైడ్రేట్లు (Low carbohydrates) ఉంటాయి. ఇవి నిదానంగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు కలవడానికి ఆలస్యం చేస్తాయి. దీంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి శారీరక శ్రమ తప్పనిసరి. కనుక ఉదయం, సాయంత్రం వేళ వ్యాయామం (Exercise) చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రాత్రి భోజనం చేశాక వెంటనే నిద్రించకుండా అరగంట పాటు వాకింగ్ చేయాలి. ఈ నియమాలను అనుసరిస్తే షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుకుంటూ పోవడంతో పాటు శాశ్వతంగా కూడా తగ్గిపోతుంది.