పురుషుల్లో ఆ శక్తి ఉండాలంటే జీవన విధానంలో ఈ మార్పులు తప్పనిసరి!

Published : Jul 14, 2022, 03:53 PM IST

పురుషులలో వృషణాల నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్లు (Testosterone hormones) ఉత్పత్తి తగ్గినప్పుడు మగతనం తగ్గుతుంది. వృషణాలకు (Testicles) అందవలసిన పోషకాలు లోపించినప్పుడు, రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమస్య పురుషులలో లైంగిక సమస్యలకు దారితీస్తుంది. మరి ఇందుకు ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
పురుషుల్లో ఆ శక్తి ఉండాలంటే జీవన విధానంలో ఈ మార్పులు తప్పనిసరి!

పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గినప్పుడు లైంగిక కోరికలు తగ్గడం (Decreased sexual desire), అంగస్తంభన సమస్యలు (Erectile dysfunction) వంటి ఇతర లైంగిక సమస్యలు ఏర్పడతాయి. దీంతో భాగస్వామిని సంతృప్తిపరచలేరు. ఈ సమస్య నివారణ కోసం రకరకాల మందులను ఉపయోగిస్తుంటారు. కానీ వీటి వాడకం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
 

26

సహజంగా టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యి మగతనాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఉదయాన్నే కాఫీ, టీ లను ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వీర్యకణాల ఉత్పత్తి (Sperm production), హార్మోన్ల ఉత్పత్తిపై (Hormone production) ప్రభావితం చూపుతాయి. కనుక కాఫీ, టీలకు బదులుగా ఉదయాన్నే వెజిటేబుల్ జ్యూస్ లను తీసుకోవాలి

36

ఈ జ్యూస్ లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఉదయం అల్పాహారంగా (Breakfast) మొలకెత్తిన గింజలు, పండ్లు ఖర్జూరాలను తీసుకుంటే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో టెస్టోస్టెరాన్ లోపాన్ని (Testosterone deficiency) తగ్గించుకోవచ్చు. అలాగే చాలామంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు.
 

46

ఈ చెడు ఆహారపు జీవనశైలి లైంగిక సమస్యలకు దారితీస్తుంది. అలాగే మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు (bad habits) హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. హార్మోన్ల ఉత్పత్తి మంచిగా ఉండాలంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్న మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలను తీసుకుంటే శరీరానికి రక్తప్రసరణ (Blood circulation) సాఫీగా జరుగుతుంది.
 

56

దీంతో వృషణాలకు రక్తప్రసరణ సాఫీగా జరిగి టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడిగింజలు, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ (Dry fruits) ను ఉదయాన్నే నానబెట్టి రాత్రి తీసుకుంటే లైంగిక హార్మోన్ల (Sex hormones) ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో పడకగదిలో రతి మన్మధుడిలా రెచ్చిపోతారు. మీ భాగస్వామికి సంపూర్ణమైన తృప్తిని అందించగలరు.
 

66

అధిక బరువు (Over weight) కారణంగా శరీరానికంతా రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. కనుక అధిక బరువును తగ్గించుకునేందుకు మంచి డైట్, వ్యాయామాలను (Exercises) పాటించడం మంచిది. ఈ ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తే పురుషులలో నాణ్యమైన వీర్యకణాల ఉత్పత్తి జరిగి మగతనం పెరుగుతుంది.

click me!

Recommended Stories