అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published : May 26, 2022, 03:16 PM IST

అవిసె గింజలలో (Flax seeds) శరీర ఆరోగ్యానికి సహాయపడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువ మోతాదులో (Overdose) తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు అంటున్నారు.. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..   

PREV
16
అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Flax seeds

అవిసె గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), వివిధ రకాల పోషకాలు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను (Cancers) నియంత్రిస్తాయి. అలాగే మహిళల్లో మోనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు తగ్గాలంటే ఈ గింజలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇందులో ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు కొన్ని శరీర అనారోగ్యానికి కూడా దారితీస్తాయి.

26
Flax seeds

అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega 3 fatty acids), పీచు (Fiber) పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగని వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం. వీటిని తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ చాలా తగ్గుతుంది కనుక బీపీ మందులు వేసుకునేవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. అవిసె గింజలను తీసుకుంటే శరీరంలో హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి.
 

36
Flax seeds

కనుక హార్మోన్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు ఈ గింజలను తీసుకుంటున్నారా అయితే జాగ్రత్త.. ఎందుకంటే అవిసె గింజలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels) తగ్గుతాయి. కాబట్టి డయాబెటిస్ మందులను తీసుకునేవారు ఈ గింజలను తీసుకుంటే చక్కెర స్థాయిలు మరింత తగ్గుతాయి.
 

46
Flax seeds

ఈ గింజలు ఈస్ట్రోజన్ ను అనుసరిస్తాయి. కనుక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఈ గింజలలో సైనోజెన్ (Cyanogen) అనే హానికరమైన రసాయనం ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతుంది. కనుక థైరాయిడ్ (Thyroid) సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను తీసుకోరాదు. అలాగే వీటిని తీసుకుంటే అయోడిన్ లోపానికి కారణం అవుతుంది.
 

56
Flax seeds

కాబట్టి ఈ గింజలను మోతాదుకు మేరకు మాత్రమే తినాలి. ఒకవేళ రోజూ తీసుకోవాలనుకునే వారు సగం టీ స్పూన్ గింజలతో మొదలుపెట్టాలి. వీటిని తీసుకుంటే ఎటువంటి అలర్జీలు (Allergies) రావడం లేదు అనుకుంటే అప్పుడు ప్రతిరోజూ ఒక స్పూన్ వరకు తినవచ్చు. అయితే అది కూడా ఒకేసారి కాదు. ఉదయం, సాయంత్రం ఇలా రోజులో రెండు సార్లు తీసుకోవడం మంచిది. వీటిని పచ్చిగా తినడం కన్నా డ్రైరోస్ట్ చేసి పొడిచేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది (Good for health).

66
Flax seeds

అవిసె గింజలను మొలకెత్తించి తీసుకుంటే మరీ మంచిదని వైద్యులు అంటున్నారు. అయితే ఈ గింజలను తిన్న తరువాత నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే మలబద్దకానికి (Constipation) దారితీస్తుంది. ఈ గింజలను గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేసి చల్లటి ప్రదేశాలలో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ (Storage) ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసె గింజల ప్రయోజనాలను సంపూర్ణంగా పొందవచ్చు.

click me!

Recommended Stories