Health : ఆల్కహాల్ అలవాటే లేకున్నా లివర్ డ్యామేజ్ అవుతుందా..! ఈ ఐదు విషయాలే కారణం

Published : Apr 30, 2026, 11:21 AM IST

ఈ రోజుల్లో లివర్ జబ్బులతో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే లివర్ డ్యామేజీకి మందు అలవాటే కారణమని చాలామంది భావిస్తుంటారు.. కానీ దాదాపు 30% నుంచి 33% మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) బారిన పడుతున్నారు. కారణమేంటో తెలుసా?

PREV
17
మందు తాగకున్నా లివర్ పాడవుతుందా..!

లివర్… మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. అయితే మందు తాగే అలవాటున్నవారిలో లివర్ సమస్యలు ఎక్కువగా ఉంటాాయి. అయితే ఇటీవల కాలంలో నాన్ ఆల్కహాలిక్ వ్యక్తుల్లో కూడా లివర్ సమస్యలు ఎక్కువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 30% నుంచి 33% మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)తో బాధపడుతున్నారు. ఇందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

27
లివర్ పనితీరు ఇదే...

మన శరీరంలో ప్రోటీన్లు, హార్మోన్ల ఉత్పత్తి, విష పదార్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియకు అవసరమైన పైత్యరసం తయారుచేయడం, బ్లడ్ షుగర్‌ను నియంత్రించడం వంటి ఎన్నో కీలక పనులను లివర్ చేస్తుంది. కాబట్టి లివర్ పనితీరు బాగుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేది. 

అయితే ప్రస్తుతం ప్రతి 10 మంది పెద్దల్లో నలుగురిని ఫ్యాటీ లివర్ సమస్య వేధిస్తోంది. కేవలం మందు తాగడం వల్లే లివర్ పాడవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఆల్కహాల్ కాకుండా లివర్‌ను దెబ్బతీసే మరో ఐదు ప్రధాన కారణాల గురించి పాథాలజిస్ట్ డాక్టర్ సోనాల్ సక్సేనా వివరిస్తున్నారు.

37
1. అహార అలవాట్లు
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం లివర్‌ను దెబ్బతీస్తుంది. ఈ అదనపు కేలరీలను లివర్ కొవ్వుగా మార్చి నిల్వ చేసుకుంటుంది. దీనివల్ల మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) వస్తుంది. షుగర్ డ్రింక్స్, వేపుళ్లు, ప్యాక్డ్ స్నాక్స్ లివర్‌పై భారం పెంచి, వాపుకు కారణమవుతాయి.
47
2. శరీరక శ్రమ లేకపోవడం

వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం అనేవి లివర్ జబ్బులకు ప్రధాన కారణాలు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు, నేరుగా లివర్ కణాల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. గంటల తరబడి కూర్చొని పనిచేసే జీవనశైలి వల్ల ఇప్పుడు 20-30 ఏళ్ల యువతలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రోజూ వ్యాయామం చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, లివర్‌లోని కొవ్వు తగ్గుతుంది.

57
3. డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక కొలెస్ట్రాల్, హైబీపీ వంటివి మెటబాలిక్ సిండ్రోమ్‌కు కారణమవుతాయి. ఇది లివర్ దెబ్బతినడానికి ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లివర్ ఆ గ్లూకోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. ఇది క్రమంగా వాపుకు దారితీస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో 60-70% మందికి NAFLD వచ్చే ప్రమాదం ఉందని 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం' పరిశోధన స్పష్టం చేస్తోంది.

67
4. హెపటైటిస్
వైరల్ హెపటైటిస్ అనేది ఆల్కహాల్ కాకుండా లివర్‌ను పాడుచేసే తీవ్రమైన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు ఏళ్ల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండానే లివర్‌ను దెబ్బతీస్తాయి. ప్రపంచంలోని మొత్తం హెపటైటిస్ బి కేసుల్లో 11.6% ఇండియాలోనే ఉన్నాయని 'ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' చెబుతోంది. సరైన చికిత్స తీసుకోకపోతే, ఈ ఇన్ఫెక్షన్లు సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా మారతాయి.
77
5. మెడిసిన్స్ ఎఫెక్ట్
నొప్పి నివారణ మందులు, కొన్ని రకాల హెర్బల్ సప్లిమెంట్లు ఎక్కువగా వాడటం, విష రసాయనాల ప్రభావానికి గురవడం కూడా లివర్‌ను దెబ్బతీస్తుంది. మనం తీసుకునే ప్రతిదాన్నీ లివర్ ప్రాసెస్ చేస్తుంది. హానికరమైన పదార్థాలు ఎక్కువైతే లివర్‌పై భారం పడుతుంది. పర్యావరణ కాలుష్యం, రసాయనాలు కూడా లివర్‌పై ఒత్తిడిని పెంచుతాయి.
Read more Photos on
click me!

Recommended Stories