పచ్చి బఠానీల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 22, 2021, 01:01 PM IST

పచ్చిబఠానీలు (Green peas) ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి చలికాలంలో అధికంగా దొరుకుతాయి. వీటిని వెజ్ బిర్యానీ, ఆలూ కుర్మా, పన్నీర్ మటర్ మసాలా వంటి అనేక వంటలలో వాడుతుంటారు. ఇలా ఏదో ఒక విధంగా నిత్యం ఆహారంలో పచ్చిబఠానీలను తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్లు మినరల్స్ శరీరానికి కావలసిన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా పచ్చిబఠానీలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..  

PREV
17
పచ్చి బఠానీల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా?

పచ్చిబఠానీల్లో విటమిన్ ఎ, సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ (Carotenoids), పాలీఫినోల్స్ (Polyphenols), ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగజేస్తాయి. అయితే ఇప్పుడు మనం పచ్చిబఠానీలతో శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 
 

27

రోగనిరోధక శక్తిని పెంచుతాయి: పచ్చి బఠానీలో  యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీఇన్ఫ్లమేటరీ (Antiinflammatory) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా సహాయపడుతాయి. 
 

37

డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది: పచ్చి బఠానిలో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా చేరనివ్వదు. పచ్చిబఠాణీలు డయాబెటిస్ (Diabetes) ఉన్నవారికి మంచి హెల్తీ ఫుడ్. టైప్2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి పచ్చిబఠానీలు చక్కగా సహాయపడుతాయి. 
 

47

మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది: కూరగాయలు, ఆకుకూరలతో కలిపి పచ్చి బఠాణీలను వండుకొని తీసుకుంటే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ప్రేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి విరేచనం (Diarrhea) సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్దకపు (Constipation) సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
 

57

బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకునే వారు డైట్ (Diet) లో కూరగాయలతో కలిపి పచ్చిబఠానీలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. 100 గ్రాములు పచ్చిబఠాణీలు అరగడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. కనుక తొందరగా ఆకలి (Hunger) వేయదు. దీంతో బరువు పెరగరు.
 

67

క్యాన్సర్ ను నివారిస్తుంది: పచ్చిబఠానీలు క్యాన్సర్ (Cancer) తో పోరాడే ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటాయి. రోజు ఒక కప్పు పచ్చి బఠాణీలను తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికడతాయి.  
 

77

పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి: పచ్చిబఠానీలలో ఐరన్, క్యాల్షియం, పాస్ఫరస్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కనుక పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉన్న పిల్లలకు పచ్చి బఠాణీలను ఉడికించి ఇస్తే వారి ఎదుగుదల కావలసిన పోషకాలను అందించి వారి బలహీనతను (Weakness) దూరం చేస్తాయి. పచ్చిబఠానీలు శరీరానికి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి.

click me!

Recommended Stories