అరవైల్లోనూ.. ఇరవైలా కనిపించాలంటే.. ఈ యోగాసానాలు వేయాల్సిందే..!

First Published Nov 16, 2021, 2:43 PM IST

వృద్ధులు యోగా చేయడం వల్ల.. వారు మళ్లీ ఉత్సాహంగా మారడానికి  సహాయపడుతుందట. అలాంటి యోగాసనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.
 

వయసు పెరిగే కొద్దీ ప్రజలు.. వ్యాయామాలను దూరం పెడుతూ ఉంటారు. ఫిట్నెస్ లక్ష్యాలకు ముగింపు పలుకుతుంటారు. అయితే.. అది తప్పు అని  నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన కండరాలు , ఎముకల కారణంగా, వృద్ధాప్యం శరీర కదలికను ఒక స్థాయికి పరిమితం చేస్తుంది. అయినప్పటికీ, వృద్ధాప్యంలో శారీరక శ్రమ చేయడం వల్ల.. మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉంటుందట.

ఎముకలు , కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాయామం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ప్రసిద్ధ వ్యాయామం. ఇది శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, మనస్సును శాంతపరచడానికి ,శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇంకా, ఇది ఫిట్‌నెస్ లక్ష్యాలను సమర్ధవంతంగా కొనసాగించడంలో సహాయపడుతుంది.

వృద్ధులు యోగా చేయడం వల్ల.. వారు మళ్లీ ఉత్సాహంగా మారడానికి  సహాయపడుతుందట. అలాంటి యోగాసనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.
 

బాధకోనాసనం

ఈ యోగాను సీతాకోకచిలుక భంగిమ అని కూడా అంటారు. దీనిని ఎలా చేయాలంటే..:

మీ కాళ్లు మడతపెట్టి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి.
మీ పాదాలను ఒకచోట చేర్చండి, అచ్చం సీతాకోక  చిలుకల రెక్కల మాదిరిగా ఉంటాయి.
ఇప్పుడు మీ చేతులతో మీ పాదాలను పట్టుకోండి మరియు మీ వీపును నిఠారుగా ఉంచండి.
తర్వాత.. సీతాకో చిలుక రెక్కలు  కదిలించినట్లుగా.. పాదాలను కదిలించాలి.
 

భుజంగాసనం

ఈ యోగాను నాగుపాము అని కూడా అంటారు. దీనిని ఎలా చేయాలంటే..:

ముందుగా బోర్లా పడుకోవాలి.
మీ అరచేతులను మీ భుజాల క్రింద ఉంచాలి. ఆ తర్వాత.. 
మీ ఛాతీని నెమ్మదిగా ఎత్తండి, తద్వారా అది ముందుకు వంపు ఉంటుంది.
మీ శ్వాసను నియంత్రించండి , మీ భుజాలను విశ్రాంతి తీసుకోండి.
మీ శరీరాన్ని తిరిగి ప్రారంభ స్థానానికి తీసుకురండి.
ఇలా కనీసం 5 సార్లు పునరావృతం చేయండి.

కటిచక్రాసనం

ఈ యోగాను స్టాండింగ్ స్పైనల్ ట్విస్ట్ పోజ్ అని కూడా అంటారు. దీనిని ఎలా చేయాలంటే..:

మీ కాళ్ళను భుజం పొడవు వేరుగా ఉంచి నిలబడండి.
మీ చేతులను ముందు చాచండి.
మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి, మీ మెడ తిప్పి.. వెనక్కి చూడాలి.
ఇలా చేస్తున్నప్పుడు, ఒక చేతిని మీ ఎదురుగా ఉన్న భుజంపై ఉంచి, మరొక చేతిని మీ వెనుకకు శరీరాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంచండి.
రెండు వైపులా రిపీట్ చేయాలి. 

శవాసన

ఈ యోగానే శవ భంగిమ అని కూడా అంటారు. మీరు ఈ క్రింది దశల్లో ఈ వ్యాయామాన్ని చేయవచ్చు:

యోగా చాప మీద పడుకోండి.
మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోండి ,మీ శ్వాసను నియంత్రించండి.
తల నుండి కాలి వరకు మీ శరీరంలోని ప్రతి భాగంపై దృష్టి పెట్టండి.
కనీసం 5 నిమిషాల పాటు ఆ స్థానంలో నిశ్శబ్దంగా పడుకోండి , మీ శరీరంపై యోగా మ్యాజిక్ లా పనిచేస్తుంది.
 

click me!